కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు……
ఆడపడుచుల కోలాలాటల మధ్య అంబరాన్నిటిన బతుకమ్మ సంబరాలు…
హనుమకొండ జిల్లా…..
తెలంగాణ బతుకమ్మ సంబరాలలో భాగంగా నేడు హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టీఎన్జీవో వారి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలలో వరంగల్ ఎంపీ శ్రీమతి కడియం కావ్య, స్థానిక వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గార్లతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు …..
అనంతరం ముఖ్య అతిథులకు టీఎన్జీవోస్ కార్యవర్గం శాలువాలతో సత్కరించడం జరిగింది…..
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ:-…
బతుకమ్మ అంటేనే తెలంగాణలో గొప్ప పండుగ….
వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండల చౌటపల్లి గ్రామంలో 1836 వ సం.. లో బతుకమ్మ జన్మించింది….
ఈ యొక్క గొప్ప చరిత్రను శాంతి కుమార్ అనే వ్యక్తి ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లి గిన్నిస్ బుక్ రికార్డును సృష్టించాడు….
మన కాకతీయల సామ్రాజ్యంలో బతుకమ్మ తల్లి జన్మించడం మనమందరం అదృష్టంగా భావించాలి భావించాలి….
ఓరుగల్లు అంటేనే పోరుగల్లు ఉద్యమాల గడ్డగా ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన గడ్డా మన ఓరుగల్లు….
దేశంలో నివసిస్తున్న వారు కూడా మన బతుకమ్మ పండుగను అంబరాన్ని అంటే విధంగా సంబరాలు చేసుకుంటారు….
ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది….
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రావీణ్య అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ మానస, టీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్ మోహన్ రావు, జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు……