రైతులు వ్యవసాయ భూములకు వెళ్లే దారులకు పునరుద్ధరణ నిధులు కేటాయించాలి… CPI ML లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్…. అంకుషాపూర్ సోమనపల్లి గ్రామాల రైతులు నిత్యం వారి వ్యవసాయ భూములకు వెళ్లే నడిమిబాట,కొడిశాల్ల బాట అద్వానంగా తయారయ్యాయని అట్టి దారులను పునరుద్ధరణ చేయుటకు నిధులు కేటాయించాలని బుధవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ నిత్యం వందలాది మంది రైతులు వారి పంట పొలాలకు మందు బస్తాలు ఎరువులను తరలించడం మరియు వివిధ వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేయడం కోసం సరైన దారి లేక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉన్న ఈ రెండు దారులు గుంతలమయం అయ్యాయని,అడుగుఅడుగు ఒక గుంత ఏర్పడి దారి గుండా వెళ్లాలంటే నరకప్రాయంగా తయారయ్యిందని, ఎడ్ల బండ్లు కూడా వెళ్లలేక అవస్థలు పడుతూ ప్రయాణాలు చేస్తున్నారని,ప్రమాదాలు జరిగి కొంతమంది గాయపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. దృష్టికి తీసుకుపోగానే స్పందించిన ఎమ్మెల్యే కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రెండు దారులను పునరుద్ధరణ చేయుటకు నిధులు కేటాయించి తీర్చగలరని విజ్ఞప్తి చేస్తున్నాం .ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కాసరవేని కుమార్, AISA జిల్లా ఇంచార్జి చెరిపెల్లి విజయ్, మండల కార్యదర్శి ఆకునూరి జగన్ తదితరులు పాల్గొన్నారు..