SAKSHITHA NEWS

కాలనీలలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలి : ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్

గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, చర్యలపై మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం….

ఈరోజు కుత్బుల్లాపూర్ లోని జంట సర్కిళ్లయిన కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిళ్ల ఉప కమిషనర్లు నర్సింహా, మల్లా రెడ్డిలు, వివిధ విభాగాల అధికారులతో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిళ్లలోని కాలనీలలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి వర్షపు నీటి ప్రభావాన్ని తగ్గించాలన్నారు. అదేవిధంగా ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా దోమల నివారణకై కాలనీలలో స్ప్రే చేయించాలి, అదేవిధంగా నీరు నిల్వ ఉండకుండా ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు గాలులకు కూలిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగిస్తూ శిదిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించాలన్నారు. అలాగే వర్షాలతో విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో ఇంజనీరింగ్ ఈఈలు కిష్టప్ప, లక్ష్మీ గణేష్, డిఈలు రూపాదేవి, పాపమ్మ, ఏఈ మల్లారెడ్డి, రవీందర్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS