SAKSHITHA NEWS

కోట్లు వెచ్చించి నిర్మించిన నిరుపయోగంగా మారిన వేసైడ్ మార్కెట్

అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం లక్ష్యానికి గండి

రెండు మూడు రోజుల్లో నిర్వాహణలోకి తీసుకొస్తామన్న జిల్లా వ్యవసాయ మార్కెటింగ్అధికారి

సాక్షిత వనపర్తి ఆగస్టు29
ప్రపంచ ప్రఖ్యాతసంస్థ సిన్ జంట గత ప్రభుత్వం భాగస్వామ్యంతో మాజీ వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆహ్వానం మేరకు వనపర్తి పట్టణ సమీపంలోని మరికుంట దగ్గర 51 వేల చదరపు విస్తీర్ణంలో 30 గ్రామాల 20 వేల రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తు లు పూలు పండ్లు కూరగాయలు మాంసం చేపలు తదితర రైతులు పండించిన స్వీయ ఉత్పత్తులను స్వయంగా దళారి వ్యవస్థ లేకుండా నేరుగా ప్రజలకే విక్రయించేందుకు మూడు కోట్ల 40 లక్షల వెచ్చించి రాష్ట్రంలోని మొట్టమొదటి వే సైడ్ మార్కెట్ను అధునాతనమైన పద్ధతుల తో 78 ప్లాట్ఫారం షెడ్లను నిర్మించడం జరిగింది దీంతోపాటు పచ్చని చెట్లతో కూడుకున్న పార్క్ పిల్లలు ఆడుకోవడానికి అట వస్తువులను ఆయాలను క్యాంటీన్, అదేవిధంగా విద్యుత్ సౌకర్యం మంచినీటి,మరుగుదొడ్లు వ్యర్థ పదార్థాల నిర్వహణ లాంటి అధునాతనమైన సౌకర్యాలతో నిర్మించి సీన్ జంట్ సంస్థ సీఈఓ హెరిక్ తో కలిసి అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి దాదాపు సంవత్సర క్రితమే ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత ఎన్నికల తంతు మొదలై రాష్ట్రంలో ప్రభుత్వాల తోపాటు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు మారిపోవడంతో వే సైడ్ సమీకృత మార్కెట్ ఇప్పటివరకు నిర్వాహణకు కొరవడి నిర్లక్ష్యానికి గురైంది రూరల్ గ్రామాల రైతుల కు ఉపయోగపడే విధంగా కోట్లు వెచ్చించి నిర్మించిన మార్కెట్ భవనం వృధాగా మారడంతో లక్ష్యానికిగండి పడినట్లు అయింద
జిల్లా అధికారులు జిల్లా అభివృద్ధి కోసం ఐ సి ఓ డి సమావేశ మందిరంలో గంటలు రోజుల తరబడి చర్చలకే పరిమితమయ్యారని ఇక నియోజకవర్గ ప్రస్తుత ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు నియోజకవర్గంలో ప్రభుత్వ భవనాలు నిర్మాణాలు పూర్తిచేసుకుని మరికొన్ని నిర్మాణాల మధ్యలోనే ఆగిపోయాయని ఇంకొన్ని శిలాఫలకాలికే పరిమితమయ్యాయని వాటిని నిర్వాహణలోకి తీసుకొచ్చి ప్రజల అవసరాలకు వినియోగించాలన్న కనీస స్పృహను విస్మరించారని తమ తమ సొంత పార్టీలో గ్రూపులు వర్గ రాజకీయాలతో ప్రైవేటు వ్యాపార సంస్థలను ప్రారంభోత్సవాల్లో పాల్గొంటూ బిజీ బిజీగా ఉంటున్నారని ప్రజల బాగోగులను నియోజకవర్గాన్ని విస్మరించారని ఇక నియోజకవర్గం అభివృద్ధి మిధ్య నన్న అనుమానాలు ప్రజల నుండి వినిపిస్తున్నాయి
వే సైడ్ మార్కెట్ పై జిల్లా మార్కెటింగ్ అధికారి స్వర్ణ సింగ్ ను వివరణ కోరగా వేసైడ్ మార్కెట్ లో విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటుచేసి రెండు మూడు రోజుల్లో ప్రారంభించడం జరుగుతుందని మున్సిపాలిటీ సహకారంతో ఫ్లెక్సీలు ఏర్పాటుతో వాహన ప్రచారాలతో రోడ్లపై కాలువలపై కూరగాయల ఇతర ఉత్పత్తులను విక్రయిస్తున్న రైతులను వేసైడ్ మార్కెట్ కు తరలించి అక్కడ విక్రయించే విధంగా కృషి చేస్తామని జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ అధికారి స్వర్ణ సింగ్ వివరణ ఇవ్వడం విశేషం.


SAKSHITHA NEWS