గణేష్ నవరాత్రులు ప్రశాంతంగా జరుపుకోవాలి. అయిజ ఎస్సై
ఐజ మండల పరిధిలో గణేష్ నవరాత్రులు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ ఆదేశాల మేరకు ఐజ ఎస్సై విజయ్ భాస్కర్ సూచనలు చేశారు.
ఈ సందర్బంగా
ఎస్సైమాట్లాడుతూ…
గణేష్ మండపాల నిర్వహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాల్సి వుంటుందని ఇందుకోసం ముందుగా నిర్వహకులు తాము ఏర్పాటు చేసే గణేష్ ప్రతిమ ఎత్తు, ఏర్పాటు చేస్తున్న ప్రదేశం నిమజ్జనం తేదీ, ప్రదేశం మొదలైన సమాచారంతో తెలంగాణ పోలీస్ శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ప్రోటోకాల్ వెబ్సైట్ https://policeportal.tspolice.gov.in ద్వారా మండపాల నిర్వహకులు పూర్తి వివరాలను నమోదుచేసుకోని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దరఖాస్తు చేసుకున్న అనంతరం సంబంధిత స్టేషన్ పోలీస్ అధికారులు ఆన్ లైన్ ద్వారా అనుమతులు జారీచేస్తారని తెలిపారు. గణేష్ మండపాలను ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి.మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారితో అనుమతులు తీసుకోవాలి.గణేష్ అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ జరుగకుండా మంచి నాణ్యత గల వైరును ఉపయోగించాలి. చదువుకునే విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా తక్కువ శబ్దకాలుష్యంతో స్పీకర్లను ఏర్పాటు చేసుకోవాలి.సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి.మండపాల్లో ఎట్టిపరిస్థితులోను డిజేను ఏర్పాటు చేయకూడదని చెప్పారు.