SAKSHITHA NEWS

హర్ ఘర్ తిరంగ అభియాన్ లో భాగంగా ఘనంగా జాతీయ జెండా ర్యాలీ..

ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా “హర్ ఘర్ తిరంగ” అభియాన్ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మురళీకృష్ణ ఆధ్వర్యంలో మనపాడు మండల కేంద్రంలో , యువకులలు భారీ ర్యాలీ మరియు జాతీయ గీతాలలాన కార్యక్రమం నిర్వహించారు..

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ అల్లంపూర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రాజగోపాల్ మాట్లాడుతూ…

మాన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో భారతదేశం ఆర్థిక వ్యవస్థ సుభీక్షంగా, సురక్షితంగా అత్యంత పటిష్టమైన రక్షణ వ్యవస్థను కలిగి ఉందని
నరేంద్ర మోడీ భారతదేశాన్ని విశ్వగురుస్థానం లో ఉంచుటకు నిరంతరం శ్రమిస్తున్నారని, ఇందులో భాగంగా అభివృద్ధి చెందిన దేశాల్లో భారతదేశం గతంలో 11వ స్థానంలో ఉండేదని గత 10 ఏళ్ల మోడీ సమర్థవంతమైన పాలనలో ఇప్పుడు 5వ స్థానానికి చేరుకుందని, ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో పౌరుల ప్రథమిక రక్షణ అత్యంత ఆందోళనకరంగా ఉన్నా భారతదేశంలో అత్యంత పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఉందని, దేశపౌరులకు గృహనిర్మాణం, ఉద్యోగ,ఉపాధి అవకాశాలతో పాటు అవసరమైన అన్ని రకాల మౌళిక సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు.
ఇలాంటి సమయంలో 75 ఏళ్ళ భారత స్వాతంత్ర్య మహోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవలని, ప్రతి ఇంటిపై గర్వంగా జాతీయ జెండాను ఎగరవేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బలరాం రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ మండల ఉపాధ్యక్షులు శేఖర్ నాయుడు రాఘవయ్య జగన్ రమేష్ పరమేష్ హుస్సేన్ శివాజీ మదన్మోహన్ వెంకటేష్ మధు బలరాం వెంకటేష్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS