స్వచ్ఛధనం – పచ్చధనం కార్యక్రమంలో భాగంగా మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , కమిషనర్ రామకృష్ణారావు,కార్పొరేటర్ కాసాని సుధాకర్ ముదిరాజ్ ప్రజాప్రతినిధులతో కలిసి 19వ డివిజన్ పరిధిలో హైలాండ్ హోమ్స్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని పలు మొక్కలు నాటి, చుట్టు ప్రక్కల ప్రాంతాలలో బ్లీచింగ్ పౌడర్,ఫాగింగ్,మరియు యాంటీ లార్వాల్ (దోమలు మరియు ఇతర కీటక నాశిని)చర్యలు నిర్వహించడం జరిగింది.
అనంతరం పలు రకాల మొక్కలను స్థానిక కాలనీ వాసులకు అందజేసారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా దోమల వలన కలిగే డెంగ్యూ,మలేరియా వ్యాధుల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించి,ఎక్కడా కూడా నీరు నిలవకుండా కార్పొరేషన్ ఆయా డివిజన్ల పరిధిలో దోమల వ్యాప్తి నివారణకు ఫాగింగ్,బ్లీచింగ్ పౌడర్,ఆయిల్ బాల్స్,కెమికల్ స్ప్రే వంటి చర్యలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.అదే విధంగా పరిసరాల పరిశుభ్రత పరిరక్షణ కోసం మనమందరం కృషి చేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు విజయలక్ష్మి సుబ్బారావు,ఆగం రాజు ముదిరాజ్,కో ఆప్షన్ సభ్యులు తలారి వీరేష్ ముదిరాజ్,సీనియర్ నాయకులు తలారి సాయి ముదిరాజ్,NMC ఆయా విభాగాల అధికారులు సిబ్బంది,స్థానిక కాలనీ అసోసియేషన్ సభ్యులు,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.