SAKSHITHA NEWS

రేజోనేన్స్ శ్రీనివాస నగర్ స్కూల్ లో బ్లూ డే మరియు రైనీ డే వేడుకలు

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

ఖమ్మం పట్టణంలోని శ్రీనివాస నగర్ నందు గల ప్రముఖ రేజోనేన్స్ పాఠశాలలో బ్లూ డే మరియు రైనీ డే ను ఎంతో ఘనంగా నిర్వహించారు. రేజోనేన్స్ విద్యార్థులు నీటిని
కాపాడండి మరియు భూమిని రక్షించండి” అనే నినాదం తో బ్లూడే మరియు రైనీ డే ను ఘనంగా జరుపుకున్నారు . ఇది కేజీ పిల్లలకు ఆహ్లాదకరమైన “నీలి రంగు” రోజు పిల్లలందరు వివిధ షేడ్స్ మరియు నీలి రంగు దుస్తులు ధరించి, తరగతి గదులను నీలిరంగు బెలూన్ల తో అలకరించి పిల్లలకు వివిధ నిలిరంగులను పరిచయం చేసారు. విద్యార్థులు వివిధ ఆటల ప్లే… వే కార్యకలాపాల ద్వార నిలం రంగు గుర్తించేలా చేశారు. నీరు, గొడుగు,బంతి, సముద్రం నీలి రంగు పడవ, పువ్వులు మొదలైన వాటి ప్రాముఖ్యతను తెలిపే నీటి చక్రం వంటి కొన్ని నీలిరంగు వస్తువులు ప్రదర్శనలో ఉండటం వలన విద్యార్థులు రంగు మరియు దాని ప్రాముఖ్యతను తెలుసుకొనే అవకశాన్ని కల్పించారు. ఈ ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ఆర్.వి నాగేంద్ర కుమా కుమార్, నీలిమ మాట్లాడుతూ ఇటువంటి విభిన్నమైన మరియు చిన్నారులకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించటం లో మా పాఠశాల ఎప్పుడు ముందుంటుందని తెలిపారు విద్యార్ధులను చైతన్య వంతులను, కార్యోన్ముఖులను చేయుటకు ఈ కార్యక్రమన్ని నిర్వహించామనీ తెలిపారు, నీలి రంగు మరియు రైనీ డే వస్తువులతో ప్రాంగానమ౦త కనులవిందుగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆర్.వి నాగేంద్ర కుమార్, నీలిమ, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాద్యాయుని, ఉపాద్యాయులు, మరియు విద్యార్థిని, విద్యార్ధులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS