SAKSHITHA NEWS

జగిత్యాల పట్టణంలోని జ్యోతి హైస్కూల్ ఐఐటి అకాడమీలో ” కార్గిల్ విజయ్ దినోత్సవము ను పురస్కరించుకొని కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికుడు , పాఠశాల డైరెక్టర్ బియ్యాల హరిచరణ్ రావు కార్గిల్ యుద్ధం గురించి , సైనికుల యొక్క గొప్పతనం వారు చేసిన త్యాగాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ
” 1999, మే 3న కార్గిల్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి భారత్, పాకిస్థాన్ మధ్య కార్గిల్ యుద్ధం ప్రారంభమయింది. దీనిని భారత సైన్యం ఆపరేషన్ విజయ్ అనే కోడ్ నేమ్ ను పెట్టుకుంది. అంతటి చలిలో, మంచు పర్వతాల్లో దాదాపు 60 రోజులపాటూ జరిగిన యుద్ధంలో ఇరుదేశాల సైనికులు చాలామంది చనిపోయారు. 527 మంది భారత సైనికులు అమరులయ్యారు.చివరికి జూలై 26న భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి, భారతదేశ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా భారత్ విజయం సాధించింది. అందువల్ల ప్రతిఏటా జూలై 26 కార్గిల్ విజయ దినోత్సవం జరుపబడుతుందని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత దేశభక్తిని పెంపొందించే మరియు సైనికుల యొక్క గొప్పతనాన్ని వివరించే నినాదాలు చెప్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీ బియ్యాల హరిచరణ్ రావు , శ్రీధర్ రావు ,మౌనికారావు, అజిత ఉపాధ్యాయ బృందం , స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 07 27 at 11.23.25

SAKSHITHA NEWS