POLICE గంజాయి అక్రమరవాణాను అడ్డుకున్న పోలీసులు
ఇద్దరు నిందితులు అరెస్ట్, రూ.11,20,000/-విలువైన,56కేజీల గంజాయి పట్టివేత.., ఒక కారు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన రూరల్ సిఐ సర్వయ్య
మధ్యాహ్నం 12:45 గంటలకు నిషేధిత గంజాయిని
అక్రమంగా రవాణా చేస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు తెలంగాణ స్టేట్ యాంటినార్కోడ్రగ్స్ వారి సహకారంతో మహబూబాబాద్ రూరల్ ఎస్ఐ వి దీపిక , సిబ్బంది మహబూబాబాద్-ఇల్లందురోడ్డులో కళ్యాణి నర్సరీ, వద్దకు చేరుకొని వాహనములు తనిఖీ నిర్వహించారు. ఒక ఇండికా విస్టా కారు నెం. MH43 X 0198 గల వాహనంలో
అజిత్అరుణ్ తొసర్, పుసుపు ఆనందరావు అనే మహారాష్ట్రకు చెందిన ఇద్దరు నిందుతులను కనుగొన్నారు. అనుమానాస్పదంగా వారి పరిస్థితి ఉండడంతో గట్టిగా ప్రశ్నించగా.., మహారాష్ట్ర పీరిడి కి చెందిన మారుతిజార్ తమకు రూ 50,000/- ఇస్తానని చెప్పి ఆంధ్రప్రదేశ్ లోని సీలేరు నుండి నిషేధిత గంజాయిని తీసుకరావాలని చెప్పి పంపించాడన్నారు. వారు ప్రయాణిస్తున్న కారులో 56 కేజీల గంజాయిని
తరలిస్తుండుగా పోలీసులు పట్టుకున్నారు. ఈ..దాడిలో ఎస్ఐ దీపిక, సిబ్బంది వెంకన్న, బాలరాజు, లింగరావు, రవి,కుమారస్వామి,శ్రీహరి,ఉమా, అశోక్ లు పాల్గొన్నారు. రూరల్ ఏఎస్ఐ సూరిబాబు కేసు నమోదు చేసారు. ఇద్దరు నిందితుల వద్ద నుండి ఒక కారు, 2 మొబైలు ఫోన్లను స్వాధీనపర్చుకున్నారు. రూరల్ సిఐ పి సర్వయ్య నిందితులను రిమాండ్ కు తరలించారు.
మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు నేతృత్వంలో
చాకచక్యంగా వ్యవహరించి గంజాయిని పట్టుకున్న రూరల్ సిఐ పి సర్వయ్య, రూరల్ ఎస్ఐ దీపిక, సిబ్బందిని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ అభినందించినారు.