పింఛన్ల పంపిణీపై కీలక ప్రకటన
ఏపీలో పెన్షన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని వినియోగించుకోవాలని, అవసరమైన చోట ఇతర శాఖల ఉద్యోగులనూ పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఒక్కో ఉద్యోగికి 50 మంది లబ్ధిదారులకు మించకుండా కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 1న ఉదయం 6 గంటల నుంచి ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ ఇవ్వాలని, వీలైనంత వరకు మొదటి రోజే అందరికీ నగదు అందించాలని అధికారులకు స్పష్టం చేసింది.