SAKSHITHA NEWS

Mrigasira Karte..Huge fish sales in Telugu states
తెలుగు రాష్ట్రాల్లో మృగశిర కార్తె..భారీగా చేపల విక్రయాలు

తెలుగు రాష్ట్రాల్లో మృగశిర కార్తె..భారీగా చేపల విక్రయాలు

మృగశిర కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యం సిద్దిస్తుందని కొందరు నమ్ముతారు. డిమాండ్‌ నేపథ్యంలో వ్యాపారులు పెద్దఎత్తున చేపలను దిగుమతి చేస్తారు. నగరంలోనే అతిపెద్దదైన ముషీరాబాద్‌ చేపల మార్కెట్‌ కు మృగశిరకార్తెకు ఒకరోజు ముందే గురువారం చేపలు పెద్ద ఎత్తున దిగుమతి అయ్యాయి.
సాధారణ రోజుల్లో మార్కెట్‌ లో 15 టన్నుల నుంచి 20 టన్నుల చేపల విక్రయాలు జరుగుతాయి. మృగశిర కార్తె సందర్భంగా రెండు తెలుగు రాష్ర్టాల నుంచి 50 టన్నుల నుంచి 70 టన్నుల చేపలు దిగుమతి అవుతా యని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.


రాష్ట్రంలో చేపల ఉత్పత్తి అధికం కావడంతో వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, నల్గొండ, చేవెళ్ల జిల్లాలతో పాటు ఏపీలోని కైకలూరు, తెనాలి, ఆకువీడు ప్రాంతాల నుంచి చేపలను దిగుమతి చేసుకున్నట్లు ముషీరాబాద్‌ వ్యాపారి పూసగోరక్‌నాథ్‌ తెలిపారు..
నిన్న గురువారం బొచ్చ, రవ్వ కిలో రూ.100 నుంచి 120కి విక్రయించారు. చిన్నసైజు చేపలు కిలో 100 రూపాయల చొప్పున విక్రయించారు. మృగశిర సందర్భంగా వీటి ధరలు శుక్రవారం పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు తెలిపారు.
కొర్రమీను చేపలు కిలో రూ. 400 నుంచి 450కి విక్రయించగా మృగశిర రోజున వీటి ధరలు అధికమవుతాయని అన్నారు. గురువారం అర్ధరాత్రి నుంచే ముషీరాబాద్‌ మార్కెట్‌లో విక్రయాలు మొదలవు తాయని తెలిపారు…


SAKSHITHA NEWS