అమరావతి: మహిష్మతి సామ్రాజ్యమా… ఊపిరి పీల్చుకో

SAKSHITHA NEWS

Amaravati: Empire of Mahishmati... Breathe

అమరావతి: మహిష్మతి సామ్రాజ్యమా… ఊపిరి పీల్చుకో అన్నట్లు తాజా ఎన్నికల విజయంతో అమరావతి ఊపిరి పీల్చుకోనుంది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని స్వప్నం సాకారం కానుంది. ఐదేళ్లుగా ఇటుక కూడా పేర్చని వైకాపా ప్రభుత్వ నిర్వాకంతో అమరావతి వెలవెలబోయింది. మరోవైపు రాష్ట్ర జీవనాడి పోలవరం సైతం విషమ సమస్యల్లో చిక్కుకుంది. చంద్రబాబు పాలనలో 2014 నుంచి 2019 వరకు పరుగులు తీసిన ఈ రెండు కీలక ప్రాజెక్టుల పనులు మళ్లీ గాడిన పడబోతున్నాయి.
రాజధాని అమరావతి నిర్మాణం కోసం రైతులు తమ సొంత భూములైన 34 వేల ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌ కింద ఇచ్చారు. ఇదో మహత్తర ప్రాజెక్టు. చంద్రబాబు హయాంలో అమరావతి నిర్మాణం వేగంగా ముందుకు సాగింది. అనేక సంస్థలు ఇందులో పాలు పంచుకునేందుకు ఆసక్తిగా ముందుకొచ్చాయి. రాజధానిలో మౌలిక సౌకర్యాలను కల్పించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.పది వేల కోట్లను వెచ్చించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ పాలన సాగుతున్న సచివాలయం, శాసనసభ, హైకోర్టు భవనాలు చంద్రబాబు హయాంలో నిర్మించినవే. శాశ్వత ప్రణాళిక ప్రకారం వీటికి పూర్తిస్థాయిలో భవనాలు ఇంకా రూపుదిద్దుకోవాల్సి ఉంది. అఖిల భారత సర్వీసు అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం కూడా చంద్రబాబు ప్రభుత్వం భవనాలను నిర్మించింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో రాజధాని అమరావతి నిర్మాణం కొత్త పుంతలు తొక్కాల్సి ఉంది. భూములిచ్చిన రైతులు గత ఐదేళ్లుగా పడని ఇబ్బందులు లేవు. వారి ఉద్యమమూ చరిత్రాత్మకమైంది. వారి ఆశలు, ఆకాంక్షలు అన్నీ కూటమి సర్కారుపైనే ఉన్నాయి.

WhatsApp Image 2024 06 05 at 15.19.26

SAKSHITHA NEWS

sakshitha

Related Posts

uttam బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSuttam బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి విచారణకు ఆదేశం uttam సూర్యాపేట జిల్లా బాలెంల ఎస్సీ మహిళా గురుకుల కళాశాల విద్యార్థినిల ఆందోళన, కళాశాల ప్రిన్సిపల్ గదిలో బీరు సీసాలు లభ్యమైన ఘటనపై రాష్ట్ర పౌరసరఫరాల,…

SAKSHITHA NEWS

varla వర్ల కుమార్ రాజా గెలుపుతో పామర్రు నియోజకవర్గానికి మహర్దశ

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSvarla ఉయ్యూరు. varla వర్ల కుమార్ రాజా గెలుపుతో పామర్రు నియోజకవర్గానికి మహర్దశ;;తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు. వై వి బి రాజేంద్ర ప్రసాద్ పామర్రు నియోజకవర్గం నుండి శాసన సభ్యుడిగా ఎన్నికైన వర్లకుమర్ రాజా గారిని తెదేపా ఉపాధ్యక్షులు వై…

SAKSHITHA NEWS

You Missed

uttam బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి

uttam బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం

varla వర్ల కుమార్ రాజా గెలుపుతో పామర్రు నియోజకవర్గానికి మహర్దశ

varla వర్ల కుమార్ రాజా గెలుపుతో పామర్రు నియోజకవర్గానికి మహర్దశ

tamil nadu తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?

tamil nadu తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?

godavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలు

godavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలు

constitution రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పార్టీ ఫిరాయింపులను

constitution రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పార్టీ ఫిరాయింపులను

You cannot copy content of this page