వనపర్తి సాక్షిత: పుస్తకాలు అజ్ఞానపు చీకటిని తొలగించే దారి దీపాలని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు.
గత కొద్ది రోజులుగా సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన పుస్తక సేకరణలో భాగంగా వనపర్తి జిల్లాకు చెందిన ప్రముఖ కవులు వల్లభాపురం జనార్ధన,ఖాజామైనొద్ధిన్ లు తమతో ఉన్న దాదాపు వేయి పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ తమ ఇళ్లలో ఉన్న విలువైన పుస్తకాలు నిరుపయోగంగా ఉండకుండా చదివే ఆసక్తి గల వారికోసం వితరణ చేయడం అభినందనీయం అన్నారు.ఈ కోవలోనే పోటీ పరీక్షలకు సంసిద్ధమౌతున్న వారి కోసం కొన్ని పుస్తకాలను సేకరించడం జరిగిందని శంకర్ గౌడ్ పేర్కొన్నారు.పుస్తక పఠనం వల్ల జ్ఞాన సముపార్జనే కాక మనో వికాసం కలుగుతుందని అన్నారు.
ఈనాటి కార్యక్రమంలో కళా వేదిక ప్రతినిధులు బైరోజు చంద్ర శేఖర్,డా.గుంటి గోపి,వి.ప్రవీణ్,మోహన్,నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
పుస్తకాలు జ్ఞానానికి దారి దీపాలు… సాహితి కళావేదిక అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్
Related Posts
ఈ నెల 29న విశాఖపట్నంలో మోదీ పర్యటన?
SAKSHITHA NEWS ఈ నెల 29న విశాఖపట్నంలో మోదీ పర్యటన? ఏపీలో ప్రధాని మోదీ ఈ నెల 29న ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పర్యటించే అవకాశాలున్నాయి.అనకాపల్లి సమీపంలోని పూడిమడక లో ఎన్టీపీసీ తలపెట్టిన గ్రీన్ఎనర్జీ ప్రాజెక్టు శంకుస్థాపన ప్రధాని మోదీ ఆధ్వర్యంలో…
వైసిపి నేత, నటుడు పోసాని కృష్ణమురళి పై కేసు నమోదు
SAKSHITHA NEWS వైసిపి నేత, నటుడు పోసాని కృష్ణమురళి పై కేసు నమోదు? అమరావతి: ప్రముఖ నటుడు,వైసీపీ హయాంలో ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరించిన నేత,నటుడు పోసాని కృష్ణ మురళి పై మరో కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం…