భాగ్య నగర్ కాలనీ ఫేజ్ – 3 లో నెలకొన్న పలు సమస్యలు

Spread the love

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని భాగ్య నగర్ కాలనీ ఫేజ్ – 3 లో నెలకొన్న పలు సమస్యలు మరియు వాటి పరిష్కారానికై తీసుకోవాల్సిన చర్యలపై, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర నిర్వహించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ భాగ్య నగర్ కాలనీ ఫేజ్ – 3 కాలనీ వాసులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను పరిగణలోకి తీసుకోని, వారి విజ్ఞప్తి మేరకు కాలనీలో పాదయాత్ర చేపట్టడం జరిగినది అని, కాలనీ లో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని వారి సమస్యను కార్పొరేటర్ దృష్టికి తీసుకుని రాగ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని కాలనీ వాసులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, సంతులిత, సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. కాలనీ వాసులు అందరూ కలిసి కాలనీ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని, కాలనీ వాసులందరి సమిష్టి కృషి తో ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దుతామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అదేవిధంగా డివిజన్ లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తామని ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు వెంకటేశ్వర రావు, శ్రీధర్, మోహన్ రావు, రామ కోటేశ్వర రావు, విజయ్ భాస్కర్, విజయ్ కృష్ణ, బ్రహ్మ శేఖర్, రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page