SAKSHITHA NEWS

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల నిమిత్తం ఇవిఎం ల మొదటి విడత ర్యాoడమైజేషన్ చేపట్టిన అనంతరం నియోజకవర్గ సెగ్మెంట్ల వారిగా ఇవిఎం లను స్ట్రాంగ్ రూమ్ లకు రవాణాకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, నూతన కలెక్టరేట్ ఆవరణలోని ఇవిఎం గోడౌన్ ను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరచి, ఇవిఎం ల ఆన్లైన్ ర్యాoడమైజేషన్ లో కేటాయించబడిన విధంగా ఆయా కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వివిప్యాట్లను సెగ్మెంట్ల వారిగా వేరుచేసి, ఆయా స్ట్రాంగ్ రూమ్ లకు భద్రత నడుమ రవాణాకు చర్యలు చేపడతామన్నారు. ఖమ్మం, పాలేరు సెగ్మెంట్లకు సంబంధించి ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల, వైరా సెగ్మెంట్ కు సంబంధించి వైరా సాంఘీక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల, మధిర సెగ్మెంట్ కు సంబంధించి మధిర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, సత్తుపల్లి సెగ్మెంట్ కు సంబంధించి జ్యోతి విద్యాలయం లో స్ట్రాంగ్ రూంలు ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, జిల్లా రెవిన్యూ అధికారిణి ఎం. రాజేశ్వరి, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ రాంబాబు, మదన్ గోపాల్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి స్వర్ణ సుబ్బారావు, బిజెపి పార్టీ ప్రతినిధి జిఎస్ ఆర్ఏ. విద్యాసాగర్, సిపిఐ (ఎం)పార్టీ ప్రతినిధి ఆర్. ప్రకాశ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఎన్. సత్యంబాబు, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి చీకటి రాంబాబు, టిడిపి పార్టీ ప్రతినిధులు పాలడుగు టిఆర్. కృష్ణప్రసాద్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
…………….

WhatsApp Image 2024 04 05 at 5.02.23 PM

SAKSHITHA NEWS