SAKSHITHA NEWS

టికెట్ల కోసం పోటీ..

వినుకొండ కాంగ్రెస్ అభ్యర్థిగా కంచర్ల పూర్ణచంద్రరావు యాదవ్..?

వినుకొండ:- కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీచేసేందుకు ఆశావహులు భారీగా ముందుకు వస్తున్నారు. ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల నుంచి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. మొన్నటి వరకూ పోటీచేసేందుకు అభ్యర్థులు ముందుకు రాని పరిస్థితి. కానీ ఇప్పుడు.. హస్తం పార్టీ తరుఫున పోటీచేసేందుకు నేతలు ఆసక్తి కనబరుస్తున్నారు. వివిధ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేస్తామంటూ ముందుకు వస్తున్నారు.

పూర్ణచంద్రరావుకు హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల..?

పూర్ణచంద్రరావు యాదవ్ గతంలో ఎన్ ఎస్ యు ఐ, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. నియోజకవర్గంలోని ప్రజలందరికీ సుపరిచితుడు అందులోనూ బీసీ నాయకుడు కావడంతో నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్న నాయకుడు. అంతేకాకుండా పార్టీలోని పెద్దలతో కూడా ఎంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడం వలన తన పేరును కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల దృష్టిలో ఉన్నట్లు తెలిసింది..

కాంగ్రెస్‌లో ఈ జోష్‌కు కారణమేంటీ?

2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతైంది. ఆ పార్టీ తరుఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రాని పరిస్థితి. ఒకవేళ వచ్చినా హస్తం గుర్తుపై పోటీ చేసిన వారికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చి, డిపాజిట్లు గల్లంతయ్యేవి. ఈ నేపథ్యంలో ఏపీలో హస్తం గుర్తు గతం వదిలిన జ్ఞాపకమేనని విశ్లేషకులు భావించారు. కానీ అనూహ్యంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ లైమ్ లైట్‌లోకి వచ్చింది. దీనికి వైఎస్ షర్మిల అధ్యక్షురాలిగా నియమితులు కావటం ఒక కారణం. ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన దగ్గర నుంచి ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు షర్మిల. పాత లీడర్లను కలుపుకోవటం సహా ఇతర పార్టీలో అసంతృప్త నేతల మీద కూడా దృష్టి సారించి ముందుకెళ్తున్నారు.

వినుకొండ నియోజకవర్గం లో బీసీల కళ నెరవేరనుందా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది..

ఎప్పటినుండో వినుకొండ నియోజకవర్గం లోని బీసీలకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలన్న కోరిక కంచర్ల పూర్ణచంద్రరావు రూపంలో నెరవేరబోతున్నందుకు వినుకొండ నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..


SAKSHITHA NEWS