యాదగిరిగుట్ట : ప్రసిద్ధ క్షేత్రమైన యాదాద్రిలో బ్రహ్మోత్సవ విశేష పర్వాలకు రాత్రి నిర్వహించిన ఎదుర్కోలు వేడుకతో శ్రీకారం చుట్టారు. అశ్వవాహనంపై పెళ్లి కొడుకుగా ముస్తాబైన నారసింహుడు, ముత్యాల పల్లకిపై శ్రీలక్ష్మీదేవిని మండపం వేదికపైకి చేర్చి పెళ్లిచూపులను నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం వరపూజ, పూలు, పండ్ల కార్యక్రమాన్ని కొనసాగించారు. సోమవారం రాత్రి కల్యాణం నిర్వహణకు ముహూర్తం నిశ్చయించే పర్వాన్ని భక్తుల హర్షద్వానాల మధ్య జరిపారు. ఉదయం యాదాద్రీశుడిని జగన్మోహిని అలంకరణలో తిరువీధి సేవోత్సవం నిర్వహించారు. ఆలయ యాగశాలలో ఉత్సవ నిత్య హవనం, పారాయణం పర్వాలు కొనసాగాయి. సాంస్కృతికోత్సవాల్లో భక్తి సంగీతం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో లోకనాథం, పర్యవేక్షకులు సురేశ్, అర్చకులు మురళి స్వామివారి కల్యాణ పట్టువస్త్రాలను పూజారులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కర్రావు, ధర్మకర్త నరసింహమూర్తి పాల్గొన్నారు
ప్రసిద్ధ క్షేత్రమైన యాదాద్రిలో బ్రహ్మోత్సవ విశేషo
Related Posts
నూతన వధూవరులను ఆశీర్వదించిన
SAKSHITHA NEWS నూతన వధూవరులను ఆశీర్వదించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి || కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ లోని శ్రీని ఎంక్లేవ్ వాసులు శ్రీనివాస్ మరియు స్వరూప కుమార్తె వివాహంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన…
కొండకల్ గ్రామ యూత్ అధ్యక్షుడు వెంకట్ రాజ్ ఆధ్వర్యం
SAKSHITHA NEWS కొండకల్ గ్రామ యూత్ అధ్యక్షుడు వెంకట్ రాజ్ ఆధ్వర్యం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు శంకరపల్లి :: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా కొండకల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు వెంకట్ రాజ్…