- జగ్గయ్యపేటలో జగన్ సహకారంతో, సామినేని కృషితో మునుపెన్నడూ లేని అభివృద్ధి
- ఎలక్షన్ వన్ సైడే – జగన్ మోహన్ రెడ్డి ని గెలిపించే బాధ్యత రాష్ట్ర ప్రజలే తీసుకున్నారు
- విజయవాడ పార్లమెంట్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)
జగ్గయ్యపేట నియోజకవర్గం, వత్సవాయి మండలం,చిట్యాల గ్రామంలో రైతు భరోసా కేంద్రం మరియు వైయస్సార్ విలేజ్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎంపీ కేశినేని నాని, ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కు ఘన స్వాగతం పలుకుతూ, గ్రామ ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. రోడ్లన్నీ పూలమయం అయ్యాయి
వైఎస్ఆర్సిపి యువత బైక్ ర్యాలీ, ట్రాక్టర్లు ర్యాలీలతో కేశినేని నాని , ఉదయభాను కు స్వాగతం పలకగా, మహిళలు కోలాటంతో ఘన స్వాగతం పలికారు
తదుపరి చిట్యాల గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలోనూ, స్థానిక చర్చ్ నందు దైవశీర్వాదలు తీసుకుని, దర్గా లో ప్రార్థనలు చేశారు
ఈ సందర్బంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ
ఒక గ్రామంలో ఒక నాయకుడు నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేస్తూ అభివృద్ధి చేస్తున్నాడంటే దానికి నిదర్శనమే ఈ చిట్యాల గ్రామం మారెళ్ల పుల్లారెడ్డి , వారి కుటుంబ సభ్యుల సేవలు చిరస్మరణీయం
ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు జగ్గయ్యపేట అభివృద్ధి కోసం ఎక్కడి నుండి నిధులు తీసుకువచ్చి,అభివృద్ధి చేసి,సమస్యలు పరిష్కరిద్దాం అనే తపన ఉన్న నాయకుడు సామినేని ఉదయభాను ఉండడం ఈ నియోజకవర్గం అదృష్టం
2019 కి ముందు 2019 తర్వాత జగ్గయ్యపేటలో జరిగిన అభివృద్ధి మన అందరి కళ్ళ ముందు కనపడుతుంది
జగ్గయ్యపేటకు రైల్వే డబల్ లైనుతో మరికొద్ది నెలల్లో రైల్వేస్టేషన్, 150 అడుగుల జాతీయ జెండా, చీకట్లు తొలగిస్తూ సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ, సీసీ రోడ్లు, డ్రైన్లు ఇలా జగ్గయ్యపేట రూపు రేఖలు మార్చిన సమర్థుడు ఎమ్మెల్యే సామినేని ఉదయభాను
చిట్యాల లాంటి చిన్న గ్రామానికే 40 కోట్లతో అభివృద్ధి చేసిన ఘనత మన సీఎం జగన్ మోహన్ రెడ్డి ది
నాడు నేడు తో మన పిల్లలు అంబేద్కర్ లా చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్లాలని, మన ఆరోగ్యాలు బాగుండాలని హెల్త్ సెంటర్లు, మల్టీ స్పెషలిటీ తరహా వైద్య సేవలు, మహిళలు సంతోషంగా ఉండాలని డ్వాక్రా రుణమాఫీ, ఆసరా, చేయూత లాంటి పథకాలు అమలుచేస్తున్న సంస్కర్త సీఎం జగన్
ప్రతీ పల్లెల్లో దేవాలయం, చర్చ్, మసీద్ ఎలా ఉంటాయో – అదే విధంగా సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు జగన్ మోహన్ రెడ్డి
మన కుటుంబాలు బాగుండాలన్నా, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, పేద, మధ్య తరగతుల వారు, అన్నీ వర్గాల వారు బావుండాలన్నా మళ్ళీ సీఎంగా జగన్ మోహన్ రెడ్డి గారే రావాలి
24 సీట్ల కోసం ముఖ్యమంత్రిగా చూసుకోవాలనే జనసైనికుల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడుకు తాకట్టు పెట్టిన పవన్ కళ్యాణ్ ని చూస్తే జాలి వేస్తుంది
2024 ఎలక్షన్స్‌లో టీడీపీ ఓడిపోవడం ఖాయం – చంద్రబాబు, లోకేష్ టీడీపీ ఆఫీస్ కాళీ చేసి సొంతూరు హైదరాబాద్ కు వెళ్లిపోవడం ఖాయం
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మారెళ్ల పుల్లారెడ్డి, కేడిసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, నెట్ కాఫ్ రాష్ట్ర చైర్మన్ వేల్పుల రవికుమార్, ఎంపీపీ కొలుసు రమాదేవి, జడ్పీటీసీ యేసపోగు దేవమణి, గ్రామ సర్పంచ్ జాల కోటేశ్వరరావు, వైస్ ఎంపీపీ రామలక్ష్మి, ఎంపీటీసీ కొడమాల తేజశ్రీ, పట్టణ పార్టీ అధ్యక్షులు ఆకుల నాని బాజీ, మైనారిటీ అధ్యక్షులు షేక్ రన్‌ను హుస్సేన్, ఏనుముల ప్రశాంతి, సొసైటీ అధ్యక్షులు సుంకర సాంబశివరావు, మండల పార్టీ అధ్యక్షులు గుత్తా శంకరరావు, మహిళా సమైక్య నాయకురాలు గంగిపోగు శిరీష, పాక్స్ చైర్మన్ కాటేపల్లి రవి కుమార్, మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ బత్తుల రామారావు, జిల్లా ఉపాధ్యక్షులు మాదాల వీరయ్య చౌదరి, తిరుమలగిరి దేవస్థానం చైర్మన్ కే.ఆర్. భరద్వాజ్, వత్సవాయి జేసీయస్ కన్వీనర్ నాగేంద్రరెడ్డి, పెనుగంచిప్రోలు జేసీయస్ కన్వీనర్ శామ్యూల్, మంగోళ్లు పాక్స్ లక్ష్మి నారాయణ , వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
DOWNLOAD APP