హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని జానకి రామ టవర్స్ వద్ద చేపడుతున్నటువంటి స్ట్రాం వాటర్ డ్రైన్ (వరద నీటి కాలువ) నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో, కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .
ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ హైదర్ నగర్ డివిజన్ లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, స్ట్రాం వాటర్ డ్రైన్ (వరద నీటి కాలువ) వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని, పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు తెలియజేసారు. అదేవిధంగా డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో అధికారులు వర్క్ ఇన్స్పెక్టర్ మహాదేవ్ డివిజన్ ఉపాధ్యక్షుడు పోతుల రాజేందర్, కాలనీ వాసులు హరి సురేష్, సురేష్, చంద్ర శేఖర్, కిరణ్, ఆదినారాయణ, కోటేశ్వర రావు, వెంకట కృష్ణ, భూషణ్, ప్రసాద్, రామకృష్ణ రాజు, విజయ్, మూర్తి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.