రేపు మధ్యాహ్నం విశాఖకి పవన్ కళ్యాణ్.
రేపటి నుండి మూడు రోజులు పాటు విశాఖలోనే పవన్ కళ్యాణ్.
విశాఖ కేంద్రంగా నాయకులతో భేటీలు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లా నాయకులతో భేటీలు, సమీక్షలు.
తరువాత విశాఖ నుండి నేరుగా ఢిల్లీకి పవన్ కళ్యాణ్
ఈ నెల 21వ తేదీన పోత్తుపై కీలక ప్రకటన.
ఆ తరువాత రాయలసీమకి పవన్ కళ్యాణ్. తిరుపతిలో రాయలసీమకి సంబంధించిన నాయకులతో భేటీలు, సమీక్షలు.
తరువాత ఒంగోలు కేంద్రంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల భేటీలు, సమీక్షలు.
ఈనెల చివరి నుండి జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం మొదలు కానుంది. రోజుకి రెండు నుండి మూడు సభలు చొప్పున 100 బహిరంగ సభల్లో పాల్గొనున్న పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటికే 100 సభలకి సంబంధించి రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు.
త్వరలో జనసేన పార్టీలో మరికొన్ని చేరికలు.
రేపు సాయంత్రం 5 గంటలకు ఉమ్మడి విశాఖ జిల్లా ఇంఛార్జిలతో పవన్ కళ్యాణ్ భేటీ.
నాయకులకు ముఖ్య సూచనలు చేయనున్న జనసేన అధినేత.
అనకాపల్లిలో ఉన్న నాగబాబు రేపు మధ్యాహ్నం నుండి పవన్ కళ్యాణ్ తో కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొణతాల రామకృష్ణ కూడా హాజరు అవుతారు.
కాగా ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి పెట్టిన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్.అందులో భాగంగానే అనకాపల్లి నుండి పార్లమెంట్ బరిలో శ్రీ కొణిదెల నాగబాబు. నాగబాబు కేంద్ర క్యాబినెట్లోకి వెళ్లే అవకాశం.