దిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది..
జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఈనెల 26కు వాయిదా వేసింది. సీనియర్ న్యాయవాది హరీశ్‌సాల్వే అందుబాటులో లేకపోవడంతో వాయిదా వేయాలని చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరారు. మూడు వారాల తర్వాత విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు..
సీఐడీ తరఫు న్యాయవాది రంజిత్‌కుమార్ స్పందిస్తూ కౌంటర్ దాఖలుకు గతంలో సమయం తీసుకుని ఇప్పుడు మళ్లీ వాయిదా కోరుతున్నారని కోర్టుకు తెలిపారు. చంద్రబాబు తరఫున కౌంటర్ దాఖలు చేశారని చెప్పారు. విచారణకు తేదీని నిర్ణయించాలని కోరారు. తొలుత రెండు వారాల తర్వాత లిస్ట్ చేయాలని ఆదేశించిన ధర్మాసనం.. రంజిత్‌కుమార్ విజ్ఞప్తితో ఈనెల 26కి వాయిదా వేసింది..