SAKSHITHA NEWS

తాడేపల్లి లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ పోస్టర్ ను విడుదల చేసిన ఎంపీ వి. విజయసాయిరెడ్డి , మంత్రి మేరుగు నాగార్జున, MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..


**సాక్షిత : *ఈ నెల 19 న రాష్ట్ర చరిత్రలోనే అద్భుత ఘట్టంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ .
డా”బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలను, ఆలోచనలను పూర్తిస్థాయిలో అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..

తాడేపల్లి లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సామాజిక సమతా సంకల్పం సభ, సామాజిక న్యాయ మహా శిల్పం పేరుతో “డా.బీఆర్‌ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ” పోస్టర్‌ను రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి , శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ , ఎంపీ నందిగాం సురేష్, మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తదితరులు విడుదల చేశారు ..

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డున సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబేద్కర్ మహా శిల్పం.. గొప్ప సామాజిక న్యాయానికి నిలువెత్తు రూపంగా నిలుస్తుందన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను, ఆలోచనలను తూచా తప్పకుండా పూర్తిస్థాయిలో అమలు చేసి.. బడుగు, బలహీన, దళిత వర్గాలకు ఉన్నత అవకాశాలు కల్పించి అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కే దక్కిందన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో మహిళా సాధికారత, సామాజిక సాధికారత, దళితులను రాజ్యాధికారంలో భాగం చేయటం ఉండే లక్ష్యాలను సీఎం జగన్ కొనసాగిస్తున్నారని వివరించారు. ఈనెల 19 న రాష్ట్ర చరిత్రలోనే అద్భుత ఘట్టంగా జరుగుతున్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు తరలిరావాలని.. బాబాసాహెబ్ అంబేద్కర్ ను గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు ..

ఈ కార్యక్రమంలో పలు కార్పొరేషన్ల చైర్మన్లు, రాష్ట్రస్థాయి ఎస్సీ నేతలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు ..

Whatsapp Image 2024 01 17 At 2.01.28 Pm

SAKSHITHA NEWS