గత రెండు సాధారణ ఎన్నికల సందర్భంలోని నివేదికలు అందచెయ్యలి
ఇకపై ప్రతి వారం సంబంధిత శాఖల లావాదేవీల సమగ్ర నివేదికను అందచెయ్యలి
కలెక్టర్ మాధవీలత, ఎస్పీ పి. జగదీష్
రానున్న సాధారణ ఎన్నికలు 2024 నేపథ్యంలో అసాధారణ రీతిలో సున్నితమైన ప్రాంతాలలో అధిక మొత్తంలో లావాదేవీలు జరిపిన వాటిపై ప్రామాణిక ఆపరేషన్ విధానం పై జిల్లా పరిధిలోని సంబంధిత శాఖల ద్వారా 2014, 2019, గత ఆరు నెలలు కాలంలో గుర్తించిన లావాదేవీల సమగ్ర నివేదికను అందచేయాలని కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి కే. మాధవీలత స్పష్టం చేశారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికలు – 2024లో ఆంధ్రప్రదేశ్ కు లోక్‌సభ మరియు శాసనసభలకు జరగనున్న సాధారణ ఎన్నికలు – వ్యయ సున్నిత నియోజకవర్గాల (ESCలు) గుర్తింపు మరియు సమ్మతి కోసం (ESPలు) పై రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్, సెబ్, కమర్షియల్ ట్యాక్స్, సేల్స్ టాక్స్, జీ ఎస్ టి, ఆదాయ పన్ను శాఖ, రవాణా, నార్కోటిక్స్, తదితర శాఖల జిల్లా అధికారులతో ఎస్పీ పీ. జగదీష్, డి ఆర్వో జి. నరసింహులు తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి కె . మాధవీలత మాట్లాడుతూ , జిల్లాలో వ్యయ పరిశీలకుడు (EO) యొక్క మొదటి సందర్శన సమయంలోగా నియోజక వర్గాల వారీగా వ్యయ సున్నితమైన వాటి వివరాలు (ESPలు) ఆయా శాఖలు సమగ్ర నివేదికను అందచేయాలని ఆదేశించారు. 2014 , 2019 ఎన్నికల సందర్భంగా గుర్తించిన వాటి సమగ్ర డేటా అందచెయ్యల్సి ఉందన్నారు.
అదే క్రమంలో కొత్తగా జిల్లా ఏర్పాటు చేసిన పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు వచ్చాయని, వాటి పరిధిలో 20 మండలాలు ఉన్నట్లు తెలియచేశారు. ఖర్చులు, అసాధారణ స్థాయిలో లావాదేవీలు, నగదు లావాదేవీలు, బ్యాంకు ఖాతాల ద్వారా ఎక్కువ మందికి ఓకే ఖాతా నుంచి డబ్బులు బదలీ కావడం, వంటి ప్రతి ఒక్క అంశాన్ని సునిశితంగా పరిశీలించి సమగ్ర డేటా అందచెయ్యల్సి ఉందన్నారు. అదే క్రమంలో రానున్న రోజుల్లో ప్రతి వారం జిల్లా కి చెందిన సంబంధిత శాఖాధికారులు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. సాధారణ ఎన్నికల ప్రక్రియ విధానంలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అందరూ అధికారులు సంసిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. పై పేర్కొన్న శాఖల పరిధిలోకి వొచ్చే వాటిని గుర్తింపు కోసం జిల్లా ఇంటెలిజెన్స్ కమిటీల నుంచి సమగ్ర నివేదిక నిర్ణీత సమయం లోగా అందచేయాలని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో నగదు, మద్యం, ఉచితాలు మొదలైన వాటి పంపిణీపై పెద్ద సంఖ్యలో లావాదేవీలు పై దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. మార్కింగ్ జాబితాలో పేర్కొన్న ఇతర అనుభావిక ప్రమాణాలను కూడా పరిశీలించాల్సి ఉంటుందన్నారు. జిల్లా వ్యయ పరిశీలకులు, కేంద్ర ఎన్నికల సంఘం , రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు జిల సందర్శన సమయంలో వాటిపై సమీక్ష నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత సూచనలు చేస్తూ, ఇప్పటికే జిల్లా స్థాయి కమిటీ వెయ్యడం జరిగిందని, ప్రతి శాఖ తరపున ఒకరిని సంప్రదింపులు, నివేదికలు అందజేసేందుకు నియమించి, వారి వివరాలు అందచెయ్యలన్నారు.
ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి. జగదీష్, డి ఆర్వో జి. నరసింహులు, ఎస్ ఈ బి అధికారి పి. సోమ శేఖర్, జిల్లా ఎక్సైజ్ అధికారి వై. శ్రీలత , జీ ఎస్ టి జాయింట్ కమిషనర్ జే. నీరజ, ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పి..పద్మ వతి దేవి, జిల్లా రవాణా అధికారి కె యస్ ఎమ్ వి కృష్ణా రావు, ఆదాయపన్ను శాఖ అధికారి ఎస్ఎస్ వి . రవి కుమార్, ఎల్ డి ఎం డివి ప్రసాద్, డిఎస్పీ ఎం .కృష్ణ కుమార్, కే. విజయ పాల్, వర్మ, తదితరులు పాల్గొన్నారు.