SAKSHITHA NEWS

అభివృద్ది పనులకు బడ్జెట్ ఆమోదం – మేయర్ శిరీష, కమిషనర్ హరిత*
ప్రజాభివృద్దికి కౌన్సిల్ కృషి – డిప్యూటీ మేయర్ భూమన అభినయ్
తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ యొక్క బడ్జెట్ ఆమోదానికి, చేయాల్సిన తిరుపతి అభివృద్ది పనులు కోసం తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ సాధారణ కౌన్సిల్ సమావేశం తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన జరగగా, కౌన్సిల్ ప్రత్యేక ఆహ్వానితులు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, ఎమ్మెల్సి సిపాయి సుబ్రమణ్యం, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్రనారాయణ, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొనగా కమిషనర్ హరిత ఐఏఎస్ అజెండాను ప్రవేశపెట్టి చర్చించడం జరిగింది.

కౌన్సిల్ ప్రత్యేక ఆహ్వానితులు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ తిరుపతి నగరంలోని రహదారులకు శ్రీవారికి సేవలందించిన మహానుభావుల పేర్లను పెడుతూ కౌన్సిల్ ఆమోదించడం అభినందనీయ మన్నారు. తిరుపతి అభివృద్దే ధ్యేయంగా పనిచేద్దామని భూమన పిలుపునిచ్చారు. డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాభివృద్దికి కౌన్సిల్ మొత్తం కృషి చేస్తున్నదని, తిరుపతిని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, కౌన్సిల్ సహకారంతో ముందుకు వెలుతున్నామన్నారు. ఎమ్మెల్సి సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ తిరుపతిలో అభివృద్ది భాగా జరుగుతూ నూతన రహదారుల విస్తరణతో దేశంలోనే ఆదర్శంగా తిరుపతి నిలుస్తున్నదన్నారు.

తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ కౌన్సిల్ తీర్మానాలను వివరిస్తూ 2024-25 వార్షిక ఏడాదికి సంబంధించి 346.46 కోట్ల అంచనాలతో రూపొందించిన బడ్జెట్ ను, అదేవిధంగా 2023-24 వార్షిక ఏడాదికి సవరించిన బడ్జెట్ ను ఆమోదించడం జరిగిందన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ నందుగల గార్బేజ్ కలెక్షన్ వాహనములకు రూట్ ఆప్టిమైజేషన్ సర్వీస్ చేయుటకు గాను మెజర్స్ రూట్ బ్లూ వారికి 59 లక్షలు కేటాయిస్తూ ఆమోదం తెలపడం జరిగిందన్నారు. తెలుగు గంగ పంప్ హౌస్ లలో అత్యవసరమగు మెటీరియల్స్ కొత్త మోటర్లు, పంప్ లు, సాప్ట్ స్టార్టర్ ల రిపేర్లు, కొత్త ట్రాన్స్ ఫార్మర్ ను, అల్యూమినియం కేబుల్స్ కొనుగొలు చేయుటకు 1 కోటి, 99 లక్షలు కేటాయింపు, 1557 మంది ఔట్సొర్సింగ్ సిబ్బందికి 2024-25 సంవత్సరానికి ఆఫ్కాస్ ద్వారా 34,60,17,696 చెల్లించుటకు పరిపాలన మంజురుకు కౌన్సిల్ ఆమోదం తెలపడం జరిగిందన్నారు.

వీధి కుక్కలను పట్టి శస్త్ర చికిత్సలు చేసి, కుక్కలకు యాంటీ రాబీస్ వ్యాక్సిన్ వేయుటకు ఒకొక్క కుక్కకు 1200 రూపాయాలు చొప్పున అనిమల్ కేర్ ల్యాండ్ వారికి మరో ఆరు నెలలు ఇచ్చేలా ఆమోదం తెలపడం జరిగిందన్నారు. మరికొన్ని పరిపాలనా, నగరాభివృద్దికి చేయాల్సిన పనులకు బడ్జెట్ కేటాయిస్తూ తీర్మానాలు చేయడం జరిగిందన్నారు. ఈ కౌన్సిల్ సమావేశంలో అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS