SAKSHITHA NEWS

ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

వచ్చే జనవరి నుంచి జీతాలతో పాటు అలవెన్స్ లను కలిపి చెల్లించాలని సీఎం జగన్ ఆదేశం

ఏపీలోని ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం జగన్‌ సర్కార్ నుంచి శుభవార్త అందింది. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి సీఎం జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనవరి నుంచి జీతాలతో పాటు అలవెన్స్ లను కలిపి చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది.

నైట్ అవుట్, డే అవుట్, ఓవర్ టైం అలవెన్సులను ఇప్పటివరకు ఆలస్యంగా చెల్లిస్తుండగా… ఇకపై జీతంతో పాటే ఇవ్వనుంది. 2017 పీఆర్సీ బకాయిలు, స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ట్రస్ట్ కు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా దశలవారీగా చెల్లించనుంది. ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కారు తమ సమస్యలు పరిష్కరించినందున ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా జగన్ సర్కార్ గుర్తించిందని రానున్న రోజులు ఈ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు.


SAKSHITHA NEWS