తిరుపతి నగరం
తమ సమస్యల పరిష్కారానికి ప్రజలు డయల్ యువర్ కమిషనర్, స్పందన కార్యక్రమాల్లో ఇచ్చే అన్ని పిర్యాధులకు తగిన పరిష్కారం చూపించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశాలు జారీ చేసారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమంలో కమిషనర్ హరిత ఐఏఎస్ అర్జీలను స్వీకరించి సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు. నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి 17, స్పందన కార్యక్రమానికి 40 పిర్యాధులు, అర్జీలు వచ్చాయి.
ముఖ్యమైన పిర్యాధుల్లో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ పోన్ ద్వారా పిర్యాధు చేస్తూ ఎస్.టి.వి నగర్లో యు.డి.ఎస్ బ్లాక్ అయ్యి ప్రజలకి ఇబ్బందిగా వుందని, తమ 14 వ డివిజన్లోని అభివృద్ది పనులపై గతంలోనే తెలిపామని, వాటిని చేపట్టవల్సిందిగా కోరారు. అదేవిధంగా స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు, 25వ డివిజన్ కార్పొరేటర్ నరసింహాచారి స్పందనలో వినతి పత్రం సమర్పిస్తూ గాంధీరోడ్డు, పూల అంగళ్ళు వద్ద హధీరాంజీ మఠానికి సంబంధించిన చిన్న చిన్న అంగళ్ళల్లో 50 ఎన్నో సంవత్సరాల నుండి షాపులు నిర్వహించుకుంట్టున్నారని, శిధిలావస్థ పేరిట వారిని ఖాళీ చేయాలని మఠం అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారని, పరిశీలించి తగు మరమ్మత్తులు చేసుకొని అక్కడే షాపులు నిర్వహించుకుంటామని, కార్పొరేషన్ అధికారులు సాయం చేయాలన్నారు. నగరపాలక సంస్థ కో ఆప్షన్ సభ్యులు ఇమామ్ సాహేబ్ ఆద్వర్యంలో వినతిపత్రం సమర్పిస్తూ గాలివీధిలో పాడైపోయిన కాలువలను నిర్మించాలన్నారు.
తిమ్మినాయుడు పాలెంలో తెలుగుగంగ నీరు కలుషితంగా వస్తున్నదని, ప్రకాశం మున్సిపల్ పార్కులో జిమ్ పరికరాలన్ని పాడైపోయినాయి మార్చవలసిందిగా, రాజన్న పార్కు వద్ద కుక్కల సమస్య అధికంగా ఉన్నదని, పాత మున్సిపల్ కార్యాలయం వెనుక టెంకాయలు వ్యాపారం చేస్తూ పగిలన టెంకాయలు అక్కడే పారేయడం వల్ల దోమల సంఖ్య పెరగడం, దుర్వాసన వస్తుందని, సరస్వతి నగర్లో రోడ్డును ఆక్రమించి బాత్రూములు కట్టారని, కొన్ని ఏరియాల్లో డ్రైనేజి సమస్యలపై వచ్చిన పిర్యాధులు, అర్జీలపై కమిషనర్ హరిత ఐఏఎస్ స్పందిస్తూ సంబంధిత అధికారులు సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు. ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మునిసిపల్ ఇంజనీర్ వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ అధికారి సేతుమాధవ్, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసులు రెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ బాలసుబ్రమణ్యం, వెటర్నరీ ఆఫిసర్ డాక్టర్ నాగేంధ్ర రెడ్డి, మేనేజర్ చిట్టిబాబు, సూపర్డెంట్లు, డిఈలు, ఆర్.ఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.