SAKSHITHA NEWS

ఓటర్ల జాబితా లో పేర్లు సరిచూసుకునేందుకు 4,5 తేదీల్లో ప్రత్యేక క్యాంప్

తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి శ్రీమతి హరిత ఐఏఎస్


సాక్షిత* : ఓటర్ల జాబితా లో పేర్లు సరిచూసుకునేందుకు, మార్పులు చేర్పులు చేసుకునేందుకు భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు, ఈ నెల 4, 5 తేదీల్లో ప్రత్యేక క్యాంప్ నిర్వహించనున్నామని తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి శ్రీమతి హరిత ఐఏఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి మాట్లాడుతూ తిరుపతి నియోజకవర్గ ప్రజలు తమ యొక్క ఓటు ను జాబితాలో తెలుసుకోవడానికి మరియు మార్పులు చేసుకోవడానికి సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్ (బి ఎల్ ఓ) 167-తిరుపతి నియోజక వర్గ పరిధి లో ఉన్న 267 పోలింగ్ కేంద్రాలలో శనివారం, ఆదివారం అందుబాటులో ఉంటారని తెలిపారు..


ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా 2024- యొక్క ముసాయిదా ఓటర్ల జాబితా 167-తిరుపతి నియోజక వర్గం సంబంధించి 267 పోలింగ్ కేంద్రాల వివరాలు, ఓటర్ల వివరాలు అక్టోబర్ 27 న ఓటర్ల సమాచారం నిమిత్తము భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రచురించడమైనదన్నారు.
ప్రతి ఓటరు సంబంధిత పోలింగ్ కేంద్రాలలో ఉన్న బూత్ లెవెల్ ఆఫీసరు ద్వారా తనిఖీ చేసుకోవాలని తెలిపారు. ఓటర్ల జాబితా లో పేరు లేని యెడల ఫారం-6 ను పూరించి దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.
ఓటర్ల జాబితా లో ఓటరు వివరములు సవరించిన యెడల ఫారం-8 దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఓటరు జాబితా లో చనిపోయిన వారు నమోదు అయినచో అలాంటి ఓటరును తొలగించుటకు ఫారం-7 ధరఖాస్తు చేసుకోవాలని అన్నారు. 18 సంవత్సరాలు వయస్సు నిండిన ప్రతి ఒక్కరు ఓటరు నమోదు కొరకు ఫారం-6 ను ఓటర్ హెల్ఫ్లైన్ యాప్ ద్వారా కాని, https://voters.eci.gov.in/ వెబ్ సైట్ ద్వారా కానీ, మరియు దగ్గరలోని ఏరియా బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO) ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు.
ఓటర్ల వివరాల కొరకు ECI వెబ్ సైట్ https://voters.eci.gov.in/ నందు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కావున ఓటర్లు అందరు ఈ వెబ్ సైట్ నందు మీ యొక్క పేరు ముసాయిదా ఓటర్ల జాబితాలో ఉన్నదో లేదో సరి చూసుకోవాలని తెలిపారు. ఓటరు గా నమోదు అయిన వారు e-EPIC (ఓటర్ ID) కార్డు ను ఓటర్ హెల్ప్ లైన్ యాప్ మరియు https://voters.eci.gov.in/ వెబ్ సైట్ ద్వారా కానీ డౌన్లొడ్ చేసుకొని ఉపయోగించు కోవచ్చునని తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి శ్రీమతి హరిత ఐఏఎస్ తెలిపారు.

Whatsapp Image 2023 11 03 At 11.56.13 Am

SAKSHITHA NEWS