SAKSHITHA NEWS

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని
ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయలేని కెసిఅర్ ప్రభుత్వం హటావో

విద్యార్థుల చదువులకు నిధులు ఇవ్వలేని రాష్టం బంగారు తెలంగాణ రాష్ట్రమా?

5,177 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్ పెంచాలని డిమాండ్
వెంటనే నిరుద్యోగ భృతిని అమలు చేయాలి
గవర్నమెంట్ టీచర్లని మోషన్లిచ్చి వెంటనే ట్రాన్స్ఫర్ చేసి DSC ని అమలు చేయాలి
ఈరోజు NSUI ఆధ్వర్యంలో జమ్మికుంట గాంధీ చౌరస్తాలో వేలాది మంది విద్యార్థులతో భారీ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అనంతరం NSUI తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ Adv. SY థామస్ మరియు NSUI కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు ఇమ్రాన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5177 కోట్ల పెండింగ్ స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దాదాపు 5 సంవత్సరాల నుండి రావాల్సిన పెండింగ్ బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థులకు మొండిచెయ్యి చూపుతో విద్యారంగాన్ని పూర్తిగా తుంగలో తొక్కే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని వారు తెలిపారు.

విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్ పెంచాలని నిరసన కార్యక్రమము చేపట్టామని విద్యార్థులకు స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ రాకపోవడం వలన ప్రైవేట్ కళాశాల యజమాన్యాలు మీరు డబ్బులు కడితేనే మీ సర్టిఫికెట్స్ ఇస్తామని వేధిస్తున్న పరిస్థితి కనిపిస్తుందన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేరుతో విద్యార్థుల నుండి అనేక ఫీజులు వసూలు చేస్తున్నారని, వాటిని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలన్నారు. విద్యా రంగం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని, కనీస ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తానని చెప్పి ఇంతవరకు కూడా దాని ఊసే తీయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు మరియు మెగా DSC పెట్టి వెంటనే 25000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి.

గ్రూప్ – | లో నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయాలి . పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్స్మెంట్ లు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కటౌట్లకు ఫ్లెక్సీలకు చేయనని అభివృద్ధికి అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి వాడుతున్న నిధులను విద్యారంగానికి కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ డిమాండ్లను వెంటనే కేసీఆర్ గారు అత్యవసర మంత్రి సమావేశాలు ఏర్పాటు చేసి మా ఈ డిమాండ్లను తీర్చాలని మాట్లాడడం జరిగింది.

లేని ఎడల ఈ నిరసన కార్యక్రమాలని ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో NSUI తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ Adv. SY థామస్, NSUI కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ. ఇమ్రాన్, జిల్లా కార్యదర్శులు పల్నాటి అభిలాష్, పర్వీస్ , అస్మత్ , అఖిల్, సమీర్ హుజురాాద్ నియోజకవర్గ నాయకులు హనుమంత్ ప్రసాద్ , అన్వేష్, అవినాష్, అరుణ్, అరవింద్, వంశీ, శివ గణేష్ ,హర్షు అజయ్ ,రాకేష్ ,పవన్ , సందీప్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 10 04 at 5.44.08 PM

SAKSHITHA NEWS