SAKSHITHA NEWS

154 వ గాంధీ జయంతి వేడుక ను
జరుపుకున్న బాపట్ల జిల్లా మాజీసైనికులు

ది 02 అక్టోబర్ 2023, బాపట్ల జిల్లా బాపట్ల పట్టణం. (బాపట్ల జిల్లా త్రివిధ దళ మాజీసైనికుల సంక్షేమ సంఘం). బాపట్ల జిల్లా మాజీసైనికులు 154 వ గాంధీ జయంతి వేడుక ను బాపట్ల నరాలశెట్టి వారి పాలెం లో వారి తాత్కాలిక కార్యాలయం నందు ఘనం గా జరిపారు. ముఖ్య కార్యదర్శి షేక్ కాలేషా అధ్యక్షతన ముఖ్యఅతిధిగా పాల్గొన్న రాష్ట్ర త్రివిధ దళ మాజీసైనికుల కమిటీ చైర్మన్ మరియు బాపట్ల జిల్లా మాజీసైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస వర ప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్రం కోసం గాంధీజీ తన జీవితాంతం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారనడంలో సందేహం లేదని అహింసా మార్గాన్ని అనుసరించి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తన స్వరాన్ని పెంచిన భారత జాతీయ ఉద్యమ నాయకుడు మహాత్మా గాంధీ అని అహింసాయుత నిరసన సూత్రానికి అంతర్జాతీయ ఖ్యాతిని కూడా పొందారని అన్నారు. భారతదేశంలో, గాంధీ జయంతిని న్యూ ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లోని గాంధీ సమాధి వద్ద ప్రార్థన సమావేశాలు, నివాళులర్పించడంతో జాతీయ సెలవుదినంగా జరుపుకుంటూ ఆయన అంత్యక్రియలు జరిగిన మహాత్మా గాంధీ సమాధి వద్ద భారత రాష్ట్రపతి , ప్రధానమంత్రి సమక్షంలో ప్రార్థనలు జరుగుతాయని జ్ఞాపకం చేశారు. అక్టోబర్ 2 యొక్క ప్రత్యేకతలను వివరిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి, వరల్డ్ హ్యాబిట్ట్ డే, ఇంటర్నేషనల్ డే అఫ్ నాన్-వయోలెన్స్ మరియు వరల్డ్ నో ఆల్కహాల్ డే గా జరుపుకుంటారని అన్నారు. అంతేకాదు తన ప్రధమకుమారుడు ప్రశాంత్ కుమార్ యొక్క 26 వ పుట్టిన రోజు కూడా ఇదే రోజున మాజీసైనికుల సమక్షంలో జరుపుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను జ్ఞాపకం చేసుకొని ప్రతీ యువతీ యువకులు దేశ పురోగతి వైపు పయనించాలని, సరిహద్దులలో కాపలా కాస్తున్న ప్రతీ సైనికునికి ధన్యవాదాలు తెలియచేశారు. అసోసియేషన్ అభివృద్ధి కొరకై అనేక విషయాలు సభ్యులతో చర్చించారు. బాపట్ల జిల్లా మాజీసైనికుల సంఘం 466 మంది సభ్యులతో ఈ నెల 12 కి మూడు సంవత్సరాలు పూర్తిచేసుకొని నాలుగవ సంవత్సరం లోకి అడుగుపెడుతుండగా మూడవ వార్షికోత్సవ వేడుకను ఈ నెల రెండవ శనివారం అనగా 14 వ తేదీన జరుపనున్నారని చైర్మన్ వర ప్రసాద్ తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మాజీసైనికులు సత్యన్నారాయణ, అబ్బారావు, కామరాజు, రహీం, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS