SAKSHITHA NEWS

WhatsApp Image 2023 09 30 at 9.04.37 PM

ఐదేళ్లలో ఆదర్శంగా ‘నెల్లూరు రూరల్’ ను తీర్చిదిద్దుతా

  • డివిజన్ అభివృద్ధికి మరో 50 లక్షలు మంజూరు
  • — ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి * నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఒక ప్రత్యేక ప్రాంతంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, రూరల్ ఇన్చార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని 32వ డివిజన్లో పలు అభివృద్ధి నిర్మాణ కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం స్థానిక ప్రజలనుదేశించి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రసంగించారు. పేద ప్రజలు ఎక్కువగా నివసించే వెంగళరావునగర్ ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక నిధులుయ్యూ ప్యాకేజీని మంజూరు చేయించి అభివృద్ధి చేయడం జరుగుతుందని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. స్థానిక కార్పొరేటర్ తాళ్లూరు అవినాష్ విజ్ఞప్తి మేరకు డివిజన్ అభివృద్ధికి మరో 50 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయడం జరుగుతుందని ఎంపీ ఆదాల తెలిపారు. ఇప్పటివరకు ముక్కు 32వ డివిజన్ లో ఐదున్నర కోట్ల రూపాయలు మేర అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఎంపీ ఆదాల తెలిపారు. ఒకేసారి 9 అభివృద్ధి నిర్మాణాల కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు విచ్చేసిన తనకు అపూర్వ స్వాగతం పలికిన వెంగల్ రావు నగర్ ప్రజలకు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి జయవర్ధన్ మాట్లాడుతూ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నాయకత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రశాంతంగా ఉందన్నారు. 2024లో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలుపు లక్ష్యంగా ప్రతి ఒక్కరు బాధ్యతగా పని పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డైరీ చైర్మన్ రంగారెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, ఏసు నాయుడు పవన్ కుమార్ రెడ్డి, మొయిళ్ళ గౌరి ముబీన, హరిబాబు యాదవ్ ఉదయగిరి నరసింహులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA NEWS