రామచంద్రపురం డివిషన్లో స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ఆధ్వర్యంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి సుమారు 25.58 కోట్ల రూపాయలతో డివిషన్లో ఉన్న అన్ని కాలనీలలో శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చెయ్యడం జరిగింది.రామచంద్రపురం శ్రీనివాస్ నగర్ కాలనీలో సీసీ రోడ్లు,యూజిడి,ఫంక్షన్ హాల్,కమ్యూనిటీ హాల్,కాంపౌండ్ వాల్ కొరకు 11.18 కోట్లు,మల్లికార్జుననగర్ కాలనీలో సీసీ రోడ్లు,యూజిడి కొరకు 1.88 కోట్లు,మయూరి నగర్లో సీసీ రోడ్లు,యూజిడి,మహిళా సమాఖ్య భవనం,ప్రెస్ క్లబ్ కొరకు 1.82 కోట్లు,శ్రీ సాయి నగర్ కాలనీ సీసీ రోడ్,యూజిడి కొరకు 40.00 లక్షలు,కాకతీయ నగర్ కాలనీలో కాకతీయ నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్,సీసీ రోడ్లు,యూజిడి కొరకు 4.63 కోట్లు,అశోక్ నగర్ కాలనీలో సీసీ రోడ్లు కొరకు 1.10 కోట్లు,జ్యోతినగర్ ఓపెన్ డ్రైన్,సీసీ రోడ్లు,యూజిడి కొరకు 1.82 కోట్లు,కనుకుంటా సీసీ రోడ్ కొరకు 28.00 లక్షలతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
వారితో డిప్యూటీ కమీషనర్ బాలయ్య,మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య,ఆదర్శ్ రెడ్డి,సర్కిల్ ప్రెసిడెంట్ పరమేష్,కుమార్ గౌడ్,శ్రీనివాస్ గౌడ్,ఐలేష్ యాదవ్,బేకు యాదయ్య,పెద్ద రాజు,మహేందర్ రెడ్డి,బల్ల నర్సింగ్,గడ్డం కుమార్,అబ్దుల్ గఫార్,బుల్లా అశోక్,రాగం యాదయ్య,బంటు నర్సింహా,చిగురు శ్రీను,కిరణ్ గౌడ్,రాములు యాదవ్,మంగలి కుమార్,ప్రమోద్ గౌడ్,సీఎం మల్లేష్,వెంకటేశ్వర్లు,అన్ని కాలనీ అధ్యక్షులు,అధ్యక్షా విభాగం,బిఆర్ఎస్ నాయకులూ,కార్యకర్తలు,కాలనీ వాసులు.