మూడు కోట్లతో గంగమ్మగుడి రహదారులు – మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్
తిరుపతి నగరం
తిరుపతి నగరంలో మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణాలు, రహదారుల వెడల్పు చేసే పనులు ప్రజల నుండి వస్తున్న ఆధరణతోనే జరుగుతున్నాయని టీటీడీ చైర్మెన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి తాతయ్యగుంట వద్ద కొత్తగా వెడల్పు చేసిన రహదారులను ఎమ్మెల్యే భూమన ముఖ్య అతిథిగా, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ ఆర్టీసి బస్టాండ్ గాంధీ విగ్రహం నుండి గంగమ్మగుడికి వచ్చే రహదారి 60 ఏళ్ళుగా ఇరుకుగా వుండి, చిన్నపాటి బండ్లు వెల్లేందుకే అనేక ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొన్నారని, నేడు రహదారుల విస్తరణతో ఈ రోడ్లపై ప్రయాణం సౌకర్యవంతంగా తయారు చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా రెండు రోజుల ముందు ఈ రహదారిపైనే ప్రయాణించి గంగమ్మ దర్శనం చేసుకోవడం జరిగిందన్నారు. ప్రజాభివృద్ది రానున్న కాలంలో మరిన్ని నూతన రహదారులు నిర్మించడం, ఇరుకైన రోడ్లను ప్రజల సహకారంతో వెడల్పు చేసే కార్యక్రమాలు మునిసిపల్ కార్పొరేషన్ సహకారంతో చేపట్టడం జరుగుతుందన్నారు.
తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ మూడు కోట్ల వ్యయంతో గాంధీ విగ్రహం నుండి గ్రూపు థీయేటర్ మీదుగా గురవారెడ్డి ఇంటి సర్కిల్ వరకు 60 అడుగుల వెడల్పుతో, అదేవిధంగా అక్కడి నుండి గంగమ్మగుడి వరకు 40 అడుగుల రోడ్డుగా రహదారులను వెడల్పు చేయడం జరిగిందని, కొత్తగా బిటి రోడ్డు నిర్మించి, కాలువలను ఏర్పాటు చేసి లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఆధునికరించడం జరిగిందన్నారు. తిరుపతి నగరాభివృద్ధికి మునిసిపల్ కార్పొరేషన్ నిరంతరం కృషి చేస్తునే వుంటుందని మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దొడ్డారెడ్డి ప్రవళ్ళికారెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిఈ మహేష్, గంగమ్మగుడి చైర్మెన్ కట్టా గోఫి యాదవ్, నాయకులు ఉదయ్ వంశీ, దొడ్డారెడ్డి శంకర్ రెడ్డి, దొడ్డారెడ్డి మునిశేఖర్ రెడ్డి, చింతా రమేష్ యాదవ్, చింతా భరణీ యాదవ్, తొండమనాటి వెంకటేష్ రెడ్డి, బుల్లి, గీతా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.