చందానగర్ డివిజన్ పరిధిలోని ఫ్రెండ్స్ కాలనీ లో ASR ఫౌండేషన్ ఛైర్మన్ ఆరవ రామకృష్ణ వారి తండ్రి కీ శే ఆరవ సుబ్బారావు జ్ఞపకార్థం ఏర్పాటు చేసిన వినాయక మండపం ను కార్పొరేటర్లు శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి , రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కాలనీ వాసులు సంక్షేమం కోసం ఆరవ రామకృష్ణ వారి తండ్రి సుబ్బారావు జ్ఞపకార్థం వినాయక మండపం ను నిర్మించడం చాలా అభినదించదగ్గ విషయం అని సమాజ హితం తన వంతు సహాయ సహకారాలు చేయడం చాలా గొప్ప విషయం అని ,ఇతరులకు ఆదర్శంగా నిలిచారు అని ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు.కాలనీ లో వినాయక నవరాత్రులు ఘనంగా నిర్వహించుకోవడానికి ఎంతగానో తోడ్పడుతుంది అని , తరవాత కాలనీ సంక్షేమం కోసం చిన్న చిన్న సమావేశాలు నిర్వహించుకోవడానికి ఎంతగానో తోడ్పడుతుంది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. ప్రతి ఒక్కరు తమ వంతు సహాయంగా ఎదో ఒక విధంగా కాలనీ అభివృద్ధికి పాటుపడలని,ప్రతి ఒక్కరు కాలనీ అభివృద్ధికి కృషి చేయాలని ,ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిద్దిదే క్రమంలో ప్రతి ఒక్కరు బాగస్వామ్యులు కావాలని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. ఈ సందర్భంగా ఆరవ రామకృష్ణ ని శాలవతో సత్కరించి ప్రత్యేకంగా అభినదించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, పాత్రికేయ మిత్రులు కొండా విజయ్, వినయ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదర్శ్ రెడ్డి, ఉరిటి వెంకట్ రావు, ప్రవీణ్ , వెంకటేష్, గురు చరణ్ దుబే,భగవాన్, రామరాజు, ప్రసాద్, నరేంద్ర ప్రసాద్ ,లక్ష్మినారాయణ, శ్రీకాంత్ రెడ్డి ,నరేందర్ బల్లా , గుడ్ల ధనలక్ష్మి, వరలక్ష్మి, భవాని, పార్వతి తదితరులు పాల్గొన్నారు.