SAKSHITHA NEWS

పవన్ కళ్యాణ్, జనసేన అధినేత

వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి

జగన్ పరిపాలన బాగుంటే రాజకీయంగా నేను, బాలకృష్ణ, లోకేష్ కలవాల్సిన అవసరం ఉండేది కాదు

చంద్రబాబు అరెస్టు రాజకీయ ప్రతీకారం తప్ప మరొకటి కాదు

మా మూలాఖత్ రాజకీయంగా ఎంతో కీలకం

అరాచక పాలనను అంతమొందించాలంటే సమష్టిగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది

కలిస్తే, వ్యక్తిగతంగా కలిసే వాళ్ళవేమో

చంద్రబాబు పై అక్రమ కేసులు పెట్టి దుర్మార్గంగా జైలుకు పంపటం బాధాకరం

విధాన నిర్ణయాల్లో ఇద్దరి అభిప్రాయాలు వేరు కావొచ్చు

ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాన్ని విభేదించా తప్ప వ్యక్తిగతంగా కాదు

తప్పుడు కేసులు అన్యాయంగా పెట్టడం బాధనిపిస్తోంది

చంద్రబాబు శక్తి సామర్థ్యాలను ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేదు

ఒక ఆర్థిక నేరగాడు మోపిన అభియోగాలతో అరెస్టు చేయడం దుర్మార్గం

జగన్ ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నాడా ?

రాష్ట్రంలో అభివృద్ధి, ఉద్యోగాల కల్పన ఎక్కడుంది

తాను బురదలో కూరుకుపోయాడు కాబట్టి అందరికీ ఆ బురద పూస్తున్నాడు

వేలాది కోట్ల హెరాయిన్ మూలాలు విజయవాడలో వెలుగు చూస్తే, ఆవిషయాన్ని కప్పిపుచ్చారు

శాంతి భద్రతల పేరుతో ప్రజల ప్రాథమిక హక్కుల్ని హరిస్తున్నాడు

ఉమ్మడి ఆంధ్ర విభజన సమయంలో నవ్యాంధ్ర కు అన్యాయం జరిగింది

నవ్యాంధ్ర కు బలమైన నాయకత్వం కావాలనే 2014లో భాజపా తెదేపా కూటమి కి మద్దతు తెలిపా

ఇప్పటి వరకూ మోదీ పిలిస్తేనే దిల్లీ వెళ్లా


SAKSHITHA NEWS