SAKSHITHA NEWS

WhatsApp Image 2023 09 11 at 6.47.48 PM

సమన్వయంతో పని చేయాలి: సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రఐపీఎస్.,*

*-గణేశ్ వేడుకలపై ఇంటర్ డిపార్ట్ మెంటల్ సమన్వయ సమావేశం*

*-ఇన్సిడెంట్ ఫ్రీగా, ఘనంగా వేడుకలు జరుపుకోవాలి – సీపీ*

రానున్న గణేష్ నవరాత్రోత్సవాల ఏర్పాట్లు, నిర్వహణ, భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., ఈరోజు  పోలీసు అధికారులు, GHMC, HMWS&SB, TSSPDCL, Fire Services, Irrigation, Road Transport, R&B, Medical and Health department, Revenue, Panchayati raj, Muncipal Department, MAUD,  తదితర శాఖల అధికారులు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి (BGUS) ప్రతినిధులతో కలిసి సైబరాబాద్ సీపీ ఆఫీసులో ఇంటర్ డిపార్ట్ మెంటల్ సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ గారు మాట్లాడుతూ.. ఈ నెల 18వ తేదీన ప్రారంభమై, సెప్టెంబర్ 28 వరకూ  కొనసాగే  గణేష్ వేడుకలను నిర్విఘ్నంగా, ఘనంగా, గౌరవప్రదంగా జరుపుకోవాలన్నారు. ఈ ఏడాది 1200 వరకు వినాయకుల ప్రతిష్ట ఉండొచ్చని అంచనా వేశామన్నారు. గణేశ్ నిమజ్జనం సజావుగా సాగేందుకు పోలీసులు 24 X 7 పని చేస్తున్నారన్నారు. భద్రతాపరంగా పోలీసులు పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నారన్నారు. గణేష్ నవరాత్రోత్సవాల ఏర్పాట్లు, నిర్వహణ, భద్రతకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన విషయంలో నిర్వాహకులతో అందరు ఇన్స్పెక్టర్లు ముందుగానే సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించాలన్నారు. గణేష్ నిమజ్జనం మొదలుకొని అంతా ముందుగా ప్రణాళిక ప్రకారం జరగాలని, ఎక్కడా  ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని ఆయన కోరారు. అదే సమయంలో ఆయా ప్రాంతాల్లోని పౌరవిభాగాలతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. మండపాలు ఏర్పాటు చేసుకునే వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

నిమజ్జనం జరిగే చెరువుల వద్ద ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులకు ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసి సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. వినాయక నిమజ్జన విధుల్లో ఉండే ఉద్యోగులు, అధికారులు, వలంటీర్లకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు పోస్టులపై నిఘా ఉంచామన్నారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు(BGUS) ప్రతినిధులు లేవనెత్తిన పలు సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు.

నిమజ్జనం దృష్ట్యా ట్రాఫిక్‌ మళ్లింపుపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. డయల్ 100 కు వచ్చే కాల్స్ పై  ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. విజిబుల్ పోలిసింగ్ తో పాటు సీసీటీవీలపై దృష్టి సారించాము. ప్రజలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అధికారులంతా సమన్వయంతో పని చేయాలన్నారు.

అనంతరం రంగారెడ్డి జిల్లా అడిషనల్ కల్లెక్టర్ ప్రతిమసింగ్, ఐ‌ఏ‌ఎస్., మాట్లాడుతూ.. GHMC, మున్సిపాల్ సిబ్బంది తో కలిసి శానిటైజేషన్ పనులను పర్యవేక్షిస్తున్నామన్నారు. అన్నీ శాకాలతో సంన్వయమ్ చేసుకుంటూ పనిచేస్తున్నామన్నారు.

భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు మాట్లాడుతూ.. నిమజ్జనం సందర్భంగా GHMC అధికారులు ముందుగానే చెరువులు, బేబీ పాండ్స్ లను సూచించాలన్నారు. వీధి దీపాలు, ఫ్లడ్ లైట్లు, అవసరమున్న మేర క్రేన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. గుంతులుగా ఉన్నరోడ్లను పూడ్చేలా R&B అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల సౌకర్యార్థం గణేశ్ నిమజ్జనం జరిగే చెరువు కట్టల వద్ద టెంట్లు, విద్యుత్‌ లైట్లను, భారీ కేడ్లను నిర్మించాలని, మంచి నీటి సౌకర్యం, మొబైల్  టాయిలెట్ల ఏర్పాటు, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు. 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేయాలన్నారు. ప్రజలు, భక్తులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు మరమ్మతు పనులు, శానిటైజేషన్ పనులను చేపట్టాలన్నారు.

ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా అడిషనల్ కల్లెక్టర్ ప్రతిమసింగ్, ఐ‌ఏ‌ఎస్., సైబరాబాద్ అడిషనల్ సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్., ట్రాఫిక్ జాయింట్ సీపీ శ్రీ నారాయణ్ నాయక్, ఐపీఎస్., మాదాపూర్  క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ సింగేన్వర్, ఐపీఎస్., మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ హర్షవర్ధన్, ఐపీఎస్., మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, మాదాపూర్ డీసీపీ సందీప్ , బాలానగర్ డీసీపీ శ్రీనివాస్ రావు, శంషాబాద్ డీసీపీ నారాయణ్ రెడ్డి, రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, మేడ్చల్ డీసీపీ శబరీష్, ఎస్బీ ఏడీసీపీ రవి కుమార్, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి (BGUS) జనరల్ సెక్రెటరీ డాక్టర్ భగవంత్ రావు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి  వైస్ ప్రెసిడెంట్ కరోడిమల్ నర్సింగ్ పురి, BGUS రాచకొండ ఇన్ చార్జ్ శశిధర్, BGUS శేరిలింగంపల్లి జోన్ ఇన్ చార్జ్ బుచ్చి రెడ్డి, BGUS కూకట్పల్లి జోన్ ఇన్ చార్జ్ మోహిత్, BGUS సభ్యులు జీవన్, ప్రీతం, మళ్ళా రెడ్డి, పృథ్వీ గౌడ్, బుక్క గోపాల్, అంజనీ కుమార్, కొమరయ్య, శ్రీధర్, పంచాయతీరాజ్ శాఖ ఆర్డీఓ  జనార్ధన్ రావు (రాజేంద్రనగర్), MPDOలు ఆంజనేయులు, మహేశ్బబౌ, ఫారూక్ హుస్సైన్, వినయ్ కుమార్, శ్రీకాంత్, పంచాయతీరాజ్ శాఖ సూపర్ ఇంటెండెంత్ శ్రీనివాస్ రావు, వేణుగోపాల్ లాలయ్య, రెవెన్యూ శాఖ నుంచి తహసిల్దార్ విజయ్ కుమార్, డిప్యూటీ తహసిల్దార్ అశ్విన్ కుమార్ (కుత్బుల్లాపూర్), HMWS&SB నుంచి డి‌ఓ‌పి స్వామి, డి‌జి‌ఎం మహేశ్, బి‌సి‌ఎస్ సాయి రాంరెడ్డి., GHMC నుంచి DC మోహన్ రెడ్డి (కూకట్పల్లి), డి‌సి కృష్ణయ్య (కూకట్పల్లి), ZC శ్రీనివాస్ రెడ్డి (శేరిలింగంపల్లి), DC రవి కుమార్ రాజేంద్రనగర్, DC మల్లా రెడ్డి (గాజుల రామారం), DC సురేశ్ (పటాన్ చెరు), SE చిన్న రెడ్డి (కూకట్పల్లి), EE గోవర్ధన్ గౌడ్ (కూకట్పల్లి), EE సత్యనారాయణ (మూసాపేట్), EE కృష్ణ చైతన్య (కుత్బు బుల్లాపూర్)DEE క్రాంతి కుమార్, అగ్నిమాపక శాఖ  DFO పూర్ణచందర్ (రాజేంద్రనగర్), ADFO లు శ్రీనయ్య, విజయ్ కుమార్, సైదులు, శ్రీనివాస్, SFO లు ఫరీద్, సుభాష్ రెడ్డి, MA & UD ఫల్గుణ్ కుమార్, మున్సిపాల్ కమీషనర్ (మణికొండ), DC లు శరత్ చంద్ర (బండ్లగూడ),  సురేందర్ రెడ్డి (నార్సింగి), త్రిల్లేశ్వర్ రావు (మేడ్చల్), జ్ఞానేశ్వర్ (శంకర్పల్లి), DC రవి కుమార్ (రాజేంద్ర నగర్), DAO చేవెళ్ళ సుదర్శన్ రెడ్డి, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ డాక్టర్ మను (సివిల్ అసిస్టెంట్ సర్జన్ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా), మున్సిపల్ కమీషనర్ వెంకన్న (షాద్ నగర్), RTA డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్  కమీషనర్ ప్రవీణ్ కుమార్, RTA MVI రవి కుమార్ (మేడ్చల్), RTA MVI విజయ్ రావు (రంగా రెడ్డి), ఇరిగేషన్ AEE లక్ష్మి నారాయణ, TSSPDCL నుంచి  AEలు  సాయి కృష్ణ (కొత్తూర్), AE శ్రీధర్ (నందిగామ), AE సత్యనారాయణ, SE గోపాయ్య (రాజేంద్ర నగర్), ఇరిగేషన్ & CAD AEE నిఖిల (కడ్తాల్), DEE నళిని, R & B NH DEE రామ కృష్ణ, జీహెచ్ఎంసీ జోనల్ డీసీలు, మున్సిపల్ కమీషనర్లు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు,  జీహెచ్ఎంసీ, ఆర్అండ్ బీ, టీఎస్ఎస్పీడీసీఎల్, ఇరిగేషన్, ఫైర్ సర్వీసెస్, మెడికల్ అండ్ హెల్త్ఎన్ డెపార్ట్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS