9వ రోజు రిలే నిరాహార దీక్ష

Spread the love

9వ రోజు రిలే నిరాహార దీక్ష

ముస్లింలకోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను రద్దుచేసిన ముస్లిం ద్రోహి జగన్

వేగేశన నరేంద్ర వర్మ
బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్

శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసన గా జాతీయ తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు వేగేశన నరేంద్ర వర్మ ఆదేశాలతో బాపట్ల నియోజకవర్గ ముస్లిం మైనారిటీ సెల్ ఆద్వర్యం లో బాబు కి తోడుగా ఒక నియంత పై పోరాటం మేము సైతం అని ముస్లిం మైనారిటీ సెల్ నాయకులు నల్లకండువాలు వేసుకొని రిలే నిరాహార దీక్ష లో పాల్గొన్నారు.ఈ దీక్ష కు సంఘీభావం గా సీపీఐ పార్టీ కార్యదర్శి జెల్ది భాగ్య శ్రీధర్ మద్దతు తెలిపారు.

మైనారిటీ ల అభివృద్ధి, సంక్షేమము పై ఎన్నికల ముందు ప్రచారంలో ఆర్భాటంగా హామీల జల్లు కురిపించిన జగన్ అధికారంలోకి రాగానే పధకాలు అన్ని రద్దు చేశారు.

ముస్లింలకు గతప్రభుత్వం రంజాన్ తోఫా అందజేసేది, వైసిపి ప్రభుత్వం వచ్చాక రద్దుచేశారు.

గతంలో దూల్హ్ న్ పథకం కింద 50వేలు ఇచ్చేవారు, ఈ ప్రభుత్వం వచ్చాక లక్ష చేస్తానని చెప్పి ముస్లిం లను మోసగించారు

అక్రమ అరెస్ట్ చేసి నిప్పులాంటి చంద్రబాబు కు అవినీతి మరక వేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది

ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు బనాయించి అధికారంను అడ్డుపెట్టుకొని రాష్ట్రము లో అరాచకం సృష్టిస్తున్నాడు

వైసీపీ ప్రభుత్వం అధికారం చెప్పటినాటి నుండి రాష్ట్రము లో పేదల కడుపు కొడతం, భవనాలు కూల్చటం తప్ప అభివృద్ధి అనేదే లేదు

ప్రజలు అంత గమనిస్తున్నారు రాబోయే ఎన్నికలో తెలుగుదేశంపార్టీ, జనసేన పార్టీ కలయికతో వైసిపి చిత్తుచిత్తు ఓడిపోవడం ఖాయం అన్నారు

సాయంత్రం:- వేగేశన నరేంద్ర వర్మ టిడిపి నాయకులకు, కార్యకర్తలకు,నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమించారు.

ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ రాష్ట్ర , నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page