SAKSHITHA NEWS

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 7వ డివిజన్ 191 ఎన్టీఆర్ నగర్ లో ప్రజా పాలనా వార్డు సభలో ముఖ్య అతిధులుగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ పాల్గొని స్థానిక కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్ బాలాజీ నాయక్ తో కలిసి వార్డ్ సభను ప్రారభించారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్లు,స్థలం ఉన్న నిరుపేద కుటుంబాలకు ఇంటి నిర్మాణానికి 5లక్షల ఆర్ధిక సహాయం, అర్హులైన నిరుపేద కుటంబాలకు రేషన్ కార్డులు 184 మంది గుర్తింపు, ఇందిరమ్మ ఇల్లు,స్థలం ఉన్న నిరుపేద కుటుంబాలకు ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్ధిక సహాయంగా 08 మంది గుర్తింపు,అదే విధంగా 413 మందికి ఇందిరమ్మ ఇండ్లు అర్హులుగా గుర్తించారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్ మంజునాథ్, మేనేజర్ జయ రాజు, వార్డు ఆఫీసర్ పూర్ణిమ,సీనియర్ అసిస్టెంట్ కె. ప్రతాప్ సింగ్, 191ఎన్టీఆర్ నగర్ ప్రెసిడెంట్ కృష్ణ,వైస్ ప్రెసిడెంట్ శోభరణి,జనరల్ సెక్రటరీ పగడాల శ్రీనివాస్, బిఅర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.