75 వ స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా 2 కె రన్ ప్రారంభించిన శాయంపేట ఎస్సై. ఎంపీపీ
సాక్షిత దినపత్రిక హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని శాయంపేట సర్పంచ్ కందగట్ల రవి& ఉపసర్పంచ్ దైనంపల్లి సుమన్. ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 కె రన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాయంపేట ఎంపీపి మెతుకు తిరుపతిరెడ్డి మరియు SI వీరభద్ర రావు హాజరై జెండా ఊపి 2 కె రన్ ప్రారంభించారు
ఎంపిపి మెతుకు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ75 వ స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా 2కే రన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమంలో మనందరం పాలుపంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు
SI వీరభద్ర రావు మాట్లాడుతూ యువత పైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని విద్యార్థులు మంచి మార్గాల వైపు వెళ్లాలని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అన్నారు
ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపిడిఓ కృష్ణమూర్తి, పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నందం, మైలారం సర్పంచ్ ప్రసాద్, మైలారం ఎంపీటీసీ గడిపే విజయ్ విజయ్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు,రాజేందర్, దైనంపల్లి పాపయ్య, శాయంపేట పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, యూత్ నాయకులు, పాల్గొన్నారు..
75 వ స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా 2 కె రన్ ప్రారంభించిన శాయంపేట ఎస్సై. ఎంపీపీ
Related Posts
స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాజీమంత్రి తలసాని
SAKSHITHA NEWS స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాజీమంత్రి తలసాని వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్నారు. భువనగిరి వద్దగల ఆలయానికి చేరుకొని స్వామి…
సన ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు..
SAKSHITHA NEWS సన ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు.. సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా)కోదాడ పట్టణంలోని సన ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలను ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. కనుమరుగైపోతున్న వివిధ పండుగల విశిష్టతను భారత గ్రామీణ సాంప్రదాయాలను నేటి తరం…