317 Justice should be given to the employees who lost their lives
317 జీవో నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలి
యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ముల్కల కుమార్
రిఆర్గనైజేషన్ ఆఫ్ ఎంప్లాయిస్ రాష్ట్రపతి ఉత్తర్వులు – 2018 లో భాగంగా ప్రభుత్వం 317 జీవో ద్వారా చేపట్టిన ఉపాధ్యాయుల లోకేషన్లో నష్టపోయిన ఉపాధ్యాయులందరికీ న్యాయం చేయాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ముల్కల కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం వీణవంక హైస్కూల్లో కాంప్లెక్స్ హెచ్ఎం పులి అశోక్ రెడ్డి చే యుటిఎఫ్ డైరీ, క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడుతూ ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించాడన్ని స్వాగతించారు. బదిలీలో అవకతవక లకు తావులేకుండా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పారదర్శకంగా నిర్వహించాలని, మెరిట్ లిస్టులో లోపాలు లేకుండా తయారు చేయాలని కోరారు. 317 జీవోలో భాగంగా స్థానచలనం పొందిన ఉపాధ్యాయులందరికీ బదిలీల్లో అవకాశం కల్పించాలని, స్పౌజ్ విషయంలో బ్లాక్ చేసిన 13 జిల్లాలను అన్ బ్లాక్ చేసి భార్యాభర్తలైన ఉద్యోగులను ఒకే జిల్లాకు కేటాయించాలన్నారు.
ముఖ్యమంత్రి హామీ మేరకు 10వేల పీఎస్ హెచ్ఎం పోస్టులను భర్తీ చేయాలన్నారు. స్థానికత కోల్పోయిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మానవత దృక్పథంతో ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేణు,లింగయ్య, రాజశేఖర్,జైపాల్ రెడ్డి,శ్రీనివాస్,ప్రవీణ్, వీరాచారి,జయ,సువిత, అరుణ శ్రీ,శాంత తదితరులు పాల్గొన్నారు.