CYBER సైబర్ నేరగాళ్ల బారిన పడి పోగొట్టుకున్న 3.4 లక్షలు గంట వ్యవధిలో ఫ్రిజ్
బాధితులు వేంటానే స్పందించి ఫిర్యాదు చేయడంతో నగదు సైబర్ నేరగాళ్ల ఖాతాలకు వెళ్లకుండా నిలిపివేత
-సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లు గుర్తించిన వేంటానే 1930/ సైబర్ క్రైమ్ పోర్టల్ లో ఫిర్యాదు చేస్తే బాధితులకు మేలు…
…పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లు గుర్తించిన గంటలో ఫిర్యాదు చేయడం వల్ల బాధితులకు మరింత వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఇటీవల కాలంలో రోజుకో రకం సైబర్ మోసాలు వెలుగు చూస్తున్నాయని, సులభంగా డబ్బు సంపాదించేందుకు కొందరు కేటుగాళ్లు మోసాల బాట పట్టి మాయమాటలతో అమాయకులను నమ్మంచి అందిన కాడికి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రధానంగా ఆన్‌లైన్‌లో అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకోవటం కన్నా.. అప్రమత్తంగా ఉండటం ముఖ్యమని పెర్కొన్నారు.
ఇటీవల నగరానికి చెందిన ఓ యువతి కి చెందిన ఇంస్టాగ్రామ్, వాట్సప్, టెలిగ్రామ్ అప్లికేషన్స్ లో వచ్చిన లింక్ ను క్లీక్ చేయడంతో రోజు వారిగా మూడు నుండి నాలుగు వేల రూపాయలు ఆదాయం వస్తుందని వచ్చిన మెసేజ్ నమ్మి విడతల వారిగా రూ. 3,43,000/- రూపాయలు పోగొట్టుకున్నారని, అయినప్పటికీ వేంటానే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయడంతో సైబర్ నేరగాళ్ల బ్యాంక్ ఖాతాలకు వెళ్లకుండా ఫ్రిజ్ చేయడం జరిగిందన్నారు.
అనాధికార ఇన్వెస్ట్మెంట్ పోర్టల్, గిఫ్ట్‌లు, కేవైసీ అప్డేట్, క్యాష్ బ్యాక్ ఆఫర్లు,స్కీములు,లోన్లు, జాబ్, వీసా, లాటరీల పేరుతో సైబర్ నేరస్తుల బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటే మరో ఆలోచన లేకుండా వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి వివరాలు చెప్పిన లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ / పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లయితే పోగొట్టుకున్న డబ్బులు తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా తెలియని నంబర్ల నుంచి మెసేజ్‌లు, కాల్స్ వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. గుర్తు తెలియని ఇంటర్నేషనల్ కాల్స్ లిఫ్ట్ చేయవద్దని, కొందరు కేటుగాళ్లు విదేశీ కోడ్ నంబర్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని అలాంటి కాల్స్ పట్ల అలర్ట్‌గా ఉండాలని తెలిపారు. మెసేజ్‌లు, స్పామ్ కాల్స్ వస్తే వెంటనే బ్లాక్ చేయాలని సూచించారు.