292 సాయిబాబా నగర్ డివిజన్ సూరారం కాలనీలోని RGK 1 నుండి 14 బ్లాక్ రోడ్డు పనులు ప్రారంభం

Sakshitha news

292 సాయిబాబా నగర్ డివిజన్ సూరారం కాలనీలోని RGK 1 నుండి 14 బ్లాక్ రోడ్డు పనులు ప్రారంభం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 292 సాయిబాబా నగర్ డివిజన్ పరిధిలోని సూరారం కాలనీ RGK గృహకల్ప 1 నుండి 14 బ్లాక్ వరకు రోడ్డు పనులు ఈరోజు ఘనంగా ప్రారంభమైనవి.

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే KP వివేకానంద గౌడ్ చొరవతో మంజూరైన ఈ రోడ్డు పనులను BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా వారాల వినోద్ కుమార్ మాట్లాడుతూ.. సాయిబాబా నగర్ డివిజన్ అభివృద్ధికి ఎమ్మెల్యే KP వివేకానంద గౌడ్ ఎల్లప్పుడూ కృషి చేస్తున్నారని, RGK కాలనీ వాసుల చిరకాల కోరిక అయిన ఈ రోడ్డు సమస్యకు పరిష్కారం లభించడం సంతోషంగా ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో కాలనీలోని మిగిలిన సమస్యలు కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు:
రాజ్ కుమార్ ముదిరాజ్ (1 నుండి 14 బ్లాక్ ప్రెసిడెంట్), రంగప్ప (జై భీమ్ నగర్ ప్రెసిడెంట్), భాస్కర్, మైత్రి నగర్ రాజు యాదవ్, బద్రి, జై సింహ రెడ్డి, భాస్కర్, గాజుల మాధవి, రాగుల పాండు, ఎరుకల అంజి, మంగళ సురేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు