కుత్బుల్లాపూర్ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నాను: బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

Sakshitha news

కుత్బుల్లాపూర్ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నాను: బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….

దుండిగల్ మున్సిపాలిటీ పరిధి సారెగూడెంలో 17.00 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన “కమ్యూనిటీ హాల్” ను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….కుత్బుల్లాపూర్ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నానని అన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం ద్వారా సమీప కాలనీల వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు జక్కుల కృష్ణ యాదవ్, సాయి యాదవ్, మహేందర్ యాదవ్, నాయకులు బాల్ రాజ్, శ్రీశైలం, వీరస్వామి, శ్రీను, నాగార్జున, మల్లేష్, దర్శన్, సత్యనారి, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.