పశ్చిమ వైసిపి కార్యాలయంలో ఘనంగా డా ఎపి జె అబ్దుల్ కలామ్ జయంతి వేడుకలు
జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు
అబ్దుల్ కలామ్ చిత్రపటానికి ఘన నివాళులర్పించిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
స్థానిక బ్రహ్మణ వీధిలోని వైసిపి విజయవాడ పశ్చిమ వైసిపి కార్యాలయం నందు ఎన్టీఆర్ జిల్లా వైసిపి మైనారిటీ అధ్యక్షులు షేక్ మస్తాన్, పశ్చిమ వైసిపి మైనారిటీ అధ్యక్షులు మొహమ్మద్ అన్వర్ ల ఆధ్వర్యంలో డా ఎపి జె అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకలలో మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని అబ్దుల్ కలాం చిత్రపటానికి ఘన నివాళులర్పించారు అనంతరం పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ క్షిపణి శాస్త్రవేతగా, భారత రాష్ట్రపతిగా డా ఏపీజే అబ్దుల్ కలాం భారత దేశానికీ అనేక సేవలందించారని అయన సేవలు మరువలేనివని కొనియాడారు. యువత అందరు అబ్దుల్ కలాం ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్రపతి పదవికే వన్నె తీసుకువచ్చారన్నారు.
ఈ కార్యక్రమంలో పశ్చిమ వైసిపి కార్పొరేటర్లు రెహమాతున్నీసా, ఇర్ఫాన్, పార్టీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
