SAKSHITHA NEWS

గర్భిణీలకు వరంగా 102 సేవలు

సాక్షిత, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి: తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకం గర్భిణులకు వరంగా మారింది. పైసా ఖర్చు లేకుండా కాన్పు ముందు, కాన్పు తర్వాత 102 వాహనంలో ఇంటికి చేర్చుతున్నారు. ప్రతీ నెలా పరీక్షలు చేపించి, తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి చేరుస్తున్నారు. ఈ సేవలను MCH పెద్దపల్లి ఆస్పత్రిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ షేఖ్ సలీం చొరవతో.. పెద్దపల్లి జిల్లా కోఆర్డినేటర్ కుమారస్వామి ఆధ్వర్యంలో 7 వాహనాలతో సేవలు కొనసాగుతున్నాయి. ఆగస్టు నెలలో దాదాపుగా 2482 గర్భిణులకు సేవలు అందించినట్లు అధికారులు తెలిపారు. గర్భిణులు 102కి కాల్ చేసి సేవలు కోరగా వెంటనే వాహన ఫైలెట్లు సమయానికి చేరుకొని సురక్షితంగా హాస్పిటల్ కు, గమ్యానికి చేరుకొని సేవలు అందిస్తున్నారు. దింతో గర్భిణులు, బాలింతలు 102 సేవలు అద్భుతంగా ఉన్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా ప్రజలు 102 సేవలను వినియోగించుకోండి: ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ షేక్ సలీం

  • 24 గంటలు అందుబాటులో ఉంటాం: జిల్లా కోఆర్డినేటర్ కుమారస్వామి

102 వాహనాల ద్వారా గర్భిణులు, బాలింతలకు ఇబ్బందులు కలగకుండా సేవలు అందిస్తున్నమని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ షేక్ సలీం, జిల్లా కోఆర్డినేటర్ కుమారస్వామి అన్నారు. నార్మల్ చెకప్‌లు, ప్రసవాల కోసం 102కు డయల్‌ చేస్తే వాహనాలు అక్కడి వెళ్తున్నాయని తెలిపారు. దవాఖానలకు తరలించి పరీక్షలు చేయించి క్షేమంగా ఇంటికి చేరుస్తున్నామన్నారు. ప్రసవాలు, చిన్నారులకు ఇమ్యునైజేషన్ తదితర సమయాల్లోనూ వాహనాలను వినియోగించుకుంటున్నారని తెలిపారు. జిల్లాలోని గర్భిణులు, బాలింతలు 102 సేవలను వినియోగించుకోవాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ షేక్ సలీం, జిల్లా కోఆర్డినేటర్ కుమారస్వామి కోరారు.


SAKSHITHA NEWS