సోమాజిగూడ యశోద హాస్పిటల్స్లో అత్యాధునిక ‘టెవార్’ వైద్యం…
సాక్షిత
సూర్యాపేట జిల్లా/ కోదాడ:
మహాధమని (అయోర్టా) సమస్యలతో సతమతమయ్యే రోగులకు సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ తీపి కబురు అందించింది. పట్టణంలోనే పబ్లిక్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అసోసియేట్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఛాతీ తెరవాల్సిన అవసరం లేకుండానే,అత్యంత తక్కువ కోతతో చికిత్స చేసే అధునాతన ‘థొరాసిక్ ఎండోవాస్క్యులర్ అయోర్టిక్ రిపేర్’ విధానాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు.
ఓపెన్ సర్జరీ చేయలేని అధిక రిస్క్ ఉన్న రోగులకు ఈ పద్ధతి ఒక గొప్ప వరం అని క్యాథెటర్ ద్వారా సురక్షిత చికిత్స పద్ధతిలో గజ్జలోని రక్తనాళం ద్వారా సన్నని క్యాథెటర్ను పంపి,దెబ్బతిన్న మహాధమని భాగానికి ప్రత్యేక స్టెంట్-గ్రాఫ్ట్ను అమరుస్తారన్నారు.దీని ద్వారా రక్తప్రవాహాన్ని క్రమబద్ధీకరించి, ప్రాణాపాయం నుంచి రోగిని కాపాడుతారు.థొరాసిక్ అయోర్టిక్ అన్యూరిజం, అయోర్టిక్ డిసెక్షన్, గాయాలు వంటి తీవ్ర సమస్యలకు ఇది సత్వర పరిష్కారం లభిస్తుంది.పెద్ద శస్త్రచికిత్స,తీవ్రమైన నొప్పి నుంచి ఉపశమనం తక్కువ రక్తం నష్టం,వేగంగా కోలుకునే అవకాశం ఆసుపత్రిలో తక్కువ రోజులు ఉంటే సరిపోవడం రోగి వయస్సు,ఆరోగ్య స్థితిని సమగ్రంగా విశ్లేషించిన తర్వాతే నిపుణులైన కార్డియాలజిస్టులు, వాస్క్యులర్ సర్జన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ రాకేష్ రెడ్డి తెలిపారు.సుమారు మూడు దశాబ్దాలుగా నమ్మకమైన వైద్య సేవలు అందిస్తున్న యశోద గ్రూప్, ఈ మినిమల్లీ ఇన్వేసివ్ విధానంతో రోగులకు ప్రపంచస్థాయి వైద్యాన్ని మరింత చేరువ చేసింది.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST