
వనపర్తి వాసులకు సిద్ధలింగ మహాస్వామి స్మారక పురస్కారాలు
- *సాక్షిత వనపర్తి
వనపర్తి పట్టణానికి చెందిన వివిధ రంగాలలో చేసిన సేవలకు నలుగురు ప్రముఖులను రాత్రి నారాయణపేట జిల్లా నెరడగం క్షేత్రంలో “తృతీయ సిద్ధలింగ మహాస్వామి” స్మారక పురస్కారాన్ని అందుకున్నారు.
గత మూడు రోజులుగా నెరడగం పశ్చిమాద్రీ సంస్థాన విరక్త మఠంలో సిద్దలింగా మహాస్వామి 60వ ఆరాధన,జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా వివిధరంగాలలో ప్రావీణ్యం సంపాదించిన వారికి పురస్కారాలు ప్రదానం చేశారు.ఆ నేపథ్యంలో వనపర్తి పట్టణానికి చెందిన గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పలుస శంకర్ గౌడ్,సూర చంద్ర శేఖర్ లను విద్యారంగంలో,చిన్నమ్మ థామస్ ను సామాజిక సేవా రంగంలో,ఆకుల శివరాజలింగంను సాహిత్య రంగంలో చేసిన సేవలకు గాను వీరికి ఈ పురస్కారాలు ప్రదానం చేశారు.నెరడగం మఠo పీఠాధిపతి పంచమ సిద్ధలింగ మహాస్వామి మాట్లాడుతూ మనిషి తన జీవితాన్ని సార్థకం చేసుకునే ప్రయత్నంలో ప్రతిభను సాధించడం అనేది ఆయా విషయాలలో వారికి గల ఆసక్తేకాక పూర్వజన్మ సుకృతంగా వివరించారు. ఈనాటి కార్యక్రమంలో కర్నాటక రాష్ట్రంలోని వివిధ మఠాల పీఠాధిపతులు జగద్గురు కొట్టూరు బసవలింగ స్వామి,సదాశివ స్వామి, అల్లమ ప్రభు స్వామి, మహంత లింగ శివాచార్య స్వామి,శాంతమల్ల శివా చార్యస్వామి,సువర్ణగిరి సిద్ధలింగ స్వామి,పద్మశ్రీ అవార్డు గ్రహీత దాసరి కొండప్ప తదితరులు పాల్గొన్నారు.వీరికి పురస్కారాలు అందడం పట్ల సాహితీ కళా వేదిక ప్రతినిధులు కందూరు నారాయణ రెడ్డి, సందాపురం బిచ్చయ్య, బైరోజు చంద్ర శేఖర్,బండారు శ్రీనివాస్,డా.శ్యాం సుందర్,డా.టూర్పింటి నరేష్ కుమార్,డి.రాములు హర్షం వ్యక్తం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app