SAKSHITHA NEWS

రాజీనామానా?బర్తరఫ్ నా నిర్ణయించు కోవాల్సింది ప్రధాని మోడీ,అమిత్ షా లే

చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ‌.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం 140 కోట్ల మంది భారత ప్రజలను అవమానించడమేనని అందుకు బాధ్యత వహించి జాతీయ హోంశాఖామంత్రి బహిరంగ క్షమాపణ చెప్పి స్వచ్ఛందంగా రాజీనామా చేయడమా లేక మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయించుకోవడమో నిర్ణయించుకోవాలని చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎం రాధాకృష్ణ డిమాండ్ చేశారు. నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కాటూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ధర్నా లో పాల్గొన్న రాధాకృష్ణ మాట్లాడుతూ పార్లమెంటు సభ్యునిగా జాతీయ హోం శాఖ మంత్రిగా పలుమార్లు ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు రాసిన రాజ్యాంగమో అమిత్ షా మరిచిపోయారా అని సూటిగా ప్రశ్నించారు. ఈ దేశంలో హిందువులు, ముస్లింలు క్రైస్తవులు పవిత్ర గ్రంథాలుగా భావించే భగవద్గీత కురాన్ బైబిల్లో ఆయా వర్గాలకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తే 140 కోట్ల మంది భారతీయులందరికీ ప్రాతినిధ్యం వహించేది డాక్టర్ బాబాసాహెబ్ రచించిన భారత రాజ్యాంగం అని హోం మంత్రి గారికి గుర్తు లేకపోవడం దురదృష్టకరమన్నారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం ప్రసన్న మాట్లాడుతూ జాతీయ నాయకులను, రాజ్యాంగ నిర్మాతను అవమానించడం భారతీయ జనతా పార్టీ నాయకులకు అలవాటుగా మారిందని దీనిని దేశంలోని అధిక సంఖ్యాకులైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ప్రజలు సహించబోరని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విమర్శించడం ఆకాశం మీద ఉమ్మేయడమేనని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి ఉప్పుటూరి అనిల్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ప్రజలందరూ ఐక్యంగా మెలగాలని సామాజిక అంతరాలు పోగొట్టి సమ సమాజాన్ని స్థాపించడం కోసం అద్భుతమైన రాజ్యాంగాన్ని రచించి ప్రపంచానికి తలమానికంగా నిలిపిన అంబేద్కర్ గారిని విమర్శించడం సిగ్గుచేటు అని విమర్శించారు. మన దేశంతో పాటు ప్రపంచ దేశాలు ఎంతగానో గౌరవిస్తుంటే స్వయానా మన దేశ హోం శాఖ మాత్యులు విమర్శించడం అత్యంత దుర్మార్గమని దేశ ప్రజలంతా కులమత ప్రాంతాలకు అతీతంగా అమిత్ షా అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నారని అన్నారు. నాదెండ్ల మండల కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ బాజీ మాట్లాడుతూ పేద ప్రజల దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించడం అంటే దేశ మాతను అవమానించడమేనని అందుకే దేశ ప్రజలంతా ముక్తకంఠంతో అమిత్ షా రాజీనామా కోరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మొట్టమొదట తహశీల్దార్ కార్యాలయం ఎదుట గల బాబా సాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలను క్షీరాభిషేకం చేసి, పూలమాలలు వేసి జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని అమిత్ షా రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎం రాధాకృష్ణ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం ప్రసన్న రాష్ట్ర కాంగ్రెస్ మాజీ కార్యదర్శి ఉప్పుటూరి అనిల్ కుమార్ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు జాస్తి నాగాంజనేయులు జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇంటూరి భవాని వెంకటేష్ చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షుడు కాటూరి కోటేశ్వరరావు పట్టణ కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షుడు కొల్లా బత్తుల అనిల్ కుమార్ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కారుచోల స్వప్న కుమార్ పట్టణ భారత జాతీయ విద్యార్థి సంఘం అధ్యక్షుడు షేక్ బాషా ఎడ్లపాడు మండల కాంగ్రెస్ నాయకులు వల్లెపు సుబ్బారావు, నియోజకవర్గ ఎస్సీ నాయకులు పుల్లగూర పరదేశి చిలకలూరిపేట మండల కాంగ్రెస్ నాయకులు ఎం విశ్వేశ్వరరావు, షేక్ అమానుల్లా చిలకలూరిపేట మండల కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు షేక్ ఖాజాబుడే బీసీ నాయకులు ఉప్పాల బాబు మాచవరపు కొండలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల వెంకటరత్నం దాసరి శ్యాంబాబు మంగళగిరి శ్రీనివాసరావు పెదలంక వెంకటేశ్వర్లు రసపుత్ర రామాంజనేయ సింగ్ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు

WhatsApp Image 2024 12 19 at 8.01.45 PM

SAKSHITHA NEWS