రవీంద్రభారతిలో సెప్టెంబర్ 2న భోగ్‌ బండారో కార్యక్రమం

Sakshitha news

బంజారా సాదు సంతుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి

రవీంద్రభారతిలో సెప్టెంబర్ 2న భోగ్‌ బండారో కార్యక్రమం

సాక్షిత ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో, ఆగస్టు 29:

తెలంగాణ రాష్ట్ర బంజారా ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ రవీంద్రభారతిలో సెప్టెంబర్‌ 2న నిర్వహించనున్న భోగ్‌ బండారో, బంజారా సాదు సంతుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేతావత్‌ జయరాం గురుస్వామి పిలుపునిచ్చారు.

సూర్యాపేట రామ్లా తండాలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జయరాం గురుస్వామి మాట్లాడుతూ బంజారా ఆధ్యాత్మిక సంప్రదాయాలు, సంస్కృతి, ఆచారాలను పరిరక్షించడంతో పాటు సాదు సంతులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అర్చకులు, గ్రామ పెద్దల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ సమ్మేళనం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

సెప్టెంబర్‌ 2న హైదరాబాద్‌ రవీంద్రభారతిలో జరిగే భోగ్‌ బండారో కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బంజారా సాదు సంతులు, అర్చకులు, ఆధ్యాత్మిక ప్రముఖులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ధనావత్‌ బాలు స్వామి, రాష్ట్ర సలహాదారు జైల్‌సింగ్‌, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు భూక్య సేవ స్వామి (మిర్యాలగూడ), జిల్లా కార్యదర్శి భూక్య బాలు (సూర్యాపేట)తో పాటు లక్పతి స్వామి, రంగస్వామి, నాగేశ్వరరావు స్వామి, మనోహర్‌ స్వామి, వెంకట్‌రెడ్డి, జయరాం స్వామి, ఉపేందర్‌ స్వామి, పలువురు అర్చకులు, గ్రామ పెద్దలు నాగరాజు, బాలాజీ, గ్రామ సర్పంచ్‌ హతిరాం తదితరులు పాల్గొన్నారు. శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో నిర్వహించిన ఈ సమావేశం ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతంగా జరిగింది. బంజారా సమాజ ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యం, సాంస్కృతిక పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు