నందమూరి హరికృష్ణకు ఘన నివాళులు అర్పించిన…… తెదేపా నాయకులు
సాక్షిత వనపర్తి ఆగస్టు 29
ఆంధ్రప్రదేశ్ చైతన్య రథసారధి మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ 8వ వర్ధంతి సందర్భంగా ఆయన పవిత్ర స్మృతులను స్మరించుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున ఘన నివాళులు అర్పించారు
అనంతరం పట్టణ అధ్యక్షులు కాగితాల లక్ష్మయ్య మాట్లాడుతూ నందమూరి హరికృష్ణ అందించిన సేవలు చిరస్మరణీయం. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
ప్రజలతో మమేకమై, పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేసిన నాయకుడిగా ఆయన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఎప్పటికీ గుర్తుండిపోతారు అని అన్నారు.
, నందమూరి హరికృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నామని తెరప నాయకులు ఈ సందర్భంగా అన్నారు .
ఈ కార్యక్రమంలో చిట్యాల బాలరాజు జంగిడి సురేష్ షాకీర్ హుస్సేన్ హోటల్ బలరాం కొత్తగొల్ల శంకర్డి . బాలరాజ్ కోమారిగిరి మేదరి బాలయ్య అప్పయ్యపల్లి బాలయ్య ట్రాక్టర్ బాలయ్య ఉపేందర్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
